home food
-
దర్శన్‌కు ఇంటి భోజనం లేనట్టే!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్ ఇంటి భోజనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్శన్‌కు ఇంటి భోజనాన్ని అనుమతించలేమని, ఆ అవసరం కూడా లేదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించగా, మీ వైఖరి ఏమిటో చెప్పాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. గత నెల రోజులుగా ఇంటి భోజనం కేసు సాగుతోంది. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేశారు. -
Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే
ఆర్డర్ చేసిన నిముషాల్లోనే డెలివరీ చేసే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడీస్ కోసం అదిరిపోయే సర్వీస్ తీసుకువచ్చింది. జొమాటో ఎవిరిడే (Zomato Everyday) పేరుతో ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తుంది. మార్కెట్లో జొమాటో ఎప్పటికప్పుడు తమ ఇన్స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగానే ఈ కొత్త సర్వీసుని అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో దీపేంద్ర గోయల్ తెలిపారు. ఈ సర్వీస్ కింద సరసమైన ధరలోనే హోమ్ స్టైల్ ఫుడ్ అందిస్తామన్నారు. 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించే సమయంలో ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. జొమాటో ఎవిరిడే సర్వీస్ ప్రారంభంలో గురుగావ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫుడ్ పార్ట్నర్ హోమ్ చెఫ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ అందిస్తారు. కంపెనీ అందించే ఈ హోమ్ స్టైల్ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89 మాత్రమే. (ఇదీ చదవండి: ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!) జొమాటో సంస్థకు ప్రధాన ప్రత్యర్థి గతంలో స్విగ్గీ 2019 లో స్విగ్గీ డెయిలీ పేరుతో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీస్ ప్రారభించింది. అయితే అనుకున్నంత సక్సెస్ సాధిచకపోవడంతో 2020లో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసులను నిలిపేసింది. అయితే ఇప్పుడు జొమాటో అలాంటి సర్వీసుని త్వరలోనే ప్రారంభిస్తుంది. జొమాటో కంపెనీ తమ కస్టమర్ల కోసం ప్రారంభించే ఈ కొత్త సర్వీస్ ఎంత వరకు సక్సస్ సాధిస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది, అంతే కాకుండా కంపెనీ డెలివరీ బాయ్స్ కోసం రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపింది. డెలివరీ బాయ్స్ ఈ రూమ్స్‌లో కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. -
మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా?
పిల్లల సక్రమ ఎదుగుదలకు సరైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం కంటే జంక్‌ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే కదా అని తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వదిలేస్తే పిల్లల ఆరోగ్యానికి అది చాలా హానికరం. అందువల్ల పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా నిరోధించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం. ముందుగా మనం ఒక విషయాన్ని నమ్మి తీరాలి. అదేమిటంటే మనం అంటే తల్లిదండ్రులు దేనిని ఆచరిస్తారో, పిల్లలు దానినే అనుసరిస్తారు. అంటే పెద్దవాళ్లు స్విగ్గీ, జొమాటోల్లో స్పైసీ ఫుడ్‌ను ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుని వాళ్ల కళ్లముందే లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే ఆటోమేటిగ్గా పిల్లలు కూడా అదే బాట పడతారు. అందువల్ల ముందుగా పెద్దవాళ్లకు గనక బయటి తిండి తినే అలవాటుంటే దానిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం బెటర్. చక్కగా ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటే పిల్లలు కూడా ఇంట్లో అమ్మ చేతి వంట తినడానికే మొగ్గు చూపిస్తారు. ►భలే చెప్పారులే, అలా ఇంట్లోనే తింటూ ఉంటే లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ తయారు చేసే కంపెనీలు దివాలా తీయవా? అని అడగొచ్చు కానీ అంతకంటే ముందు మన బడ్జెట్టు బజ్జీ అవడం, ఆ తర్వాత ఒళ్లు గుల్ల అవడం ఖాయం. అందువల్ల అలాంటి వాటిని తినడాన్ని వారానికో, పదిరోజులకో ఒకసారికి పరిమితం చేయడం ఉత్తమం. ►ఒకవేళ పిల్లలు పిజ్జా బర్గర్లు, నూడుల్స్ తప్ప తినేది లేదని మారాం చేస్తుంటే మాత్రం వాటిలో కూరగాయలను మిక్స్ చేయడం ద్వారా వారికి ఇష్టమైన ఆహారాన్ని కూడా హెల్తీగా మార్చుకోవచ్చు. దీంతో పిల్లలు కూడా ఇంటి ఆహారాన్ని ఎంజాయ్ చేసి బయటివి తినడం తగ్గించుకుంటారు. ►పిల్లలు చాలా త్వరగా అందమైన, రంగురంగుల వస్తువుల వైపు ఆకర్షితులవుతారు. అటువంటి పరిస్థితులలో, చిరుతిండిలో కూడా మీరు పిల్లలకు వివిధ రంగుల పండ్లను అలంకరించవచ్చు. దీనితో పాటు ప్లేట్లో అందంగా అలంకరించిన రంగురంగుల ఫ్రూట్ చాట్ కూడా పిల్లలకు నచ్చుతుంది. ►ఆరోగ్యంగానే తినడాన్ని అలవాటు చేయండి పిల్లలకు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలు జంక్ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. అందువల్ల, 3–4 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లల ఆహారపుటలవాట్లను సరిచేయడం అవసరం. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉండటం వల్ల వారికి కడుపు నిండి జంక్‌ఫుడ్ తినాలని పట్టుబట్టరు. -
అమితాబ్‌కు ప్రభాస్ విందు భోజనం.. అవి మాత్రం జీర్ణించుకోలేను
Prabhas Treats Amitabh Bachchan With Home Delicious Food: టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ అభిమానులకు సినిమాలతో విందు భోజనం వడ్డించనున్నాడు. సినిమాలతోనే కాకుండా తనతో షూటింగ్లో పాల్గొనే కోస్టార్స్కు సైతం విందు భోజనం ప్రేమగా వడ్డిస్తాడు ఈ బుజ్జిగాడు. ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటిరుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్‌కు విందు భోజనం వడ్డించాడు. ఇప్పుడు మరో బిగ్ స్టార్‌కు ప్రభాస్ ఆతిథ్యం అందించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్‌బీకి ప్రభాస్ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ తెలిపారు. 'టీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను.' అని ట్వీట్ చేశారు అమితాబ్. T 4198 - 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army .. the special cookies .. beyond scrumptious .. And your compliments beyond digestible 🤣 — Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022 -
కరోనా రోగులగు ఇంటికే ఆహారం
-
చిదంబరానికి ఇంటి భోజనం నో
న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్ కోర్టుని కోరడంతో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్ వాదించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’ అని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్‌కు జొన్నన్నం పెడతా..
- సీఎం భోజనానికి వస్తానన్నది సరదాకే..: జానారెడ్డి - కేసీఆర్ నా దగ్గరకొచ్చే ధైర్యం చేయరు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లి.. పప్పు పెట్టినా, పులుసు పెట్టినా తిని రావాలని ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీ లాబీల్లో సరదా సంభాషణలకు కారణమయ్యాయి. దీనిపై ప్రతిపక్షనేత కె.జానారెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మా ఇంటికి భోజనానికి రావాలనే కోరిక ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు. కానీ వస్తున్నట్టుగా చెప్పలేదు. అయినా అది సరదాకు చేసిన వ్యాఖ్య. దానిలో రాజకీయం ఉందనుకోవడం లేదు. ఒకవేళ కేసీఆర్ మా ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతా. కేసీఆర్‌తో నేను కలిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమా, నష్టమా అనేది కలిసిన తర్వాత విశ్లేషించుకోవచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ ప్రస్తావించగా ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామికంగా, హుందాగా వ్యవహరించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. ప్రతిపక్షపార్టీల నేతలను గౌరవించాలనే సంస్కారం లేని కేసీఆర్‌కు తనతో కలసి భోజనం చేసే ధైర్యం చేయరని వ్యాఖ్యానించారు. -
‘నా పదవిపై ఆసక్తి ఉంటే చెప్పొచ్చు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతానని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో సరదాగా ముచ్చటించారు. తన ఇంటికి భోజనానికి సీఎం కేసీఆర్ వస్తానన్నారు కానీ, వస్తున్నట్టుగా ఇంకా చెప్పలేదని చమత్కరించారు. తన పనితీరు బాగోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ తనతో అనలేదని తెలిపారు. సీఎల్పీ నాయకుడి పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను సూచించానని జానారెడ్డి వెల్లడించారు. జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని తన మనసులో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లే సాంప్రదాయం గతంలో ఉండేదని, సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సుందరయ్య ఇంటికి భోజనానికి వెళ్లేవారని గుర్తు చేశారు. మళ్లీ అటువంటి సాంప్రదాయం రావాలని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని... ఆయన పప్పు పెట్టినా, పులుసు పోసినా తిని వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. -
హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు. అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్‌తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది.