హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు.
అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది.