Peter
-
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంతో వస్తున్న 'బెల్'
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు. దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్రాజ్కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
చనిపోయింది నా మూడో భర్త కాదు, నేను సంతోషంగా ఉన్నా: వనిత
నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్ కుమార్. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన పీటర్ పాల్ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్షిప్లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్‌గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కాగా లాక్డౌన్లో వనిత, పీటర్ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు. ఆతర్వాత సింగిల్‌గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్ డ్రాప్ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీటర్స్ మృతి
కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థ 23వ డివిజన్ కార్పొరేటర్ జోసెఫ్ చంద్రభూషణం పీటర్స్ (71) మృతి చెందారు. కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కుమారుడు పీటర్స్. 1947 నవంబర్ 23న ఎంఎస్ పీటర్, సుగుణమ్మ దంపతులకు జేసీబీ పీటర్స్ జన్మించారు. ఆయన కెమిస్ట్రీ అధ్యాపకునిగా పలమనేరు, జిల్లాలోని ప్రభుత్వ పురుషుల కళాశాలల్లో పని చేశారు. వైఎస్ఆర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినపుడు ఆయనకు వ్యక్తిగత సలహాదారునిగా పని చేశారు. తర్వాత వయోజన విద్య సహాయ సంచాలకులుగా, పులివెందుల, సింహాద్రిపురం కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. అనంతరం స్వచ్ఛందంగా పదవీ విరమణ పొంది, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో కడప నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2014లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున 23వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. కో ఆప్షన్ సభ్యునిగా, కార్పొరేటర్‌గా ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. పలువురి సంతాపం : కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారితోపాటు టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, హరిప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, సుభాన్‌బాషా, కార్పొరేటర్లు బోలా పద్మావతి, వైఎస్ఆర్సీపీ నగర అ««ధ్యక్షుడు పులి సునీల్ నివాళులు అర్పించారు. పీటర్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి!
ముంబై: నటి సెలీనా మరోసారి కవలలకు జన్మనివ్వబోతోంది. ఐదేళ్ల క్రితం తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చింది సెలీనా. వారికి విన్స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టింది. తాజాగా భర్త పీటర్‌తో కలిసి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లింది సెలీనా. ఆమెకు వైద్య పరీక్షల్లో భాగంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో ఈ సారి కూడా కవలలేనా? అని భర్త పీటర్ డాక్టర్‌ను ప్రశ్నించగా.. అవును! అని డాక్టర్ సమాధానం ఇచ్చారని సెలీనా తెలిపింది. ఆ మాట వినగానే భార్యభర్తలిద్దరూ ఒక్క క్షణంపాటు షాక్ తిన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయామని వివరించింది. త్వరలో ఓ యాడ్ షూట్ కోసం ఇండియా రానున్నట్లు వెల్లడించింది సెలీనా. -
ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు
ముంబై: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా, సంజీవ్ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 364 (కిడ్నాప్), 203 (తప్పుడు సమాచారం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) ప్రకారం కేసు నమోదైంది. ఇవికాకుండా షీనా సోదరుడు మిఖాయిల్ బోరా హత్యకు కుట్ర పన్నినందుకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలపై ఐసీపీ 307 (హత్యాప్రయత్నం), 120 (బి) సెక్షన్ల ప్రకారం అదనంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఫిబ్రవరి 1న విచారిస్తామని జడ్జి హెచ్ మహాజన్ తెలిపారు. కాగా, తనకు పీటర్ నుంచి విడాకులు కావాలని ఇంద్రాణి కోరగా.. ఈ విషయంలో కోర్టు చేయగలిగేది ఏమీ లేదని జడ్జి తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనాను 2012లో హత్య చేసి మృతదేహాన్ని రాయ్‌గడ్ జిల్లాలోని అడవుల్లో కాల్చివేసిన విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసులో కీలక విషయాలు
దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్‌ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి. మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్‌కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్‌లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. సంభాషణలో కొన్ని భాగాలు... పీటర్, రాహుల్ సంభాషణలో... షీనా గురించి తన తండ్రిని రాహుల్ అడిగాడు. కానీ తనకేమీ తెలియదని జవాబు ఇచ్చాడు. కానీ షీనా చివరి మెసేజ్ ఇంద్రాణికే పంపించిందని తెలియగానే, ఈ విషయంపై చర్చించడానికి గోవాకు రావాలని రాహుల్‌ను పీటర్ ఆదేశించాడు. షీనా ఎవరికీ చెప్పకుండా ఎటు వెళ్లదు. తను అలాంటి వ్యక్తి కాదు. షీనా కనిపించకుండా పోవడంపై కొంత బాధను రాహుల్ వ్యక్తపరిచాడు. ఎవరికీ టచ్ లేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా యాక్టివ్‌గా లేదు. మరో టేపు సంభాషణ.. షీనా తన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్‌కు కాంటాక్ట్‌లోనే ఉందని రాహుల్‌కు ఇంద్రాణి చెప్పింది. షీనా లీవ్ తీసుకుంటున్నట్టు హెచ్ఆర్ తెలిపినట్టు ఇంద్రాణి రాహుల్‌కు తెలిపింది. కానీ అధికారికంగా రాజీనామా చేయలేదని వెల్లడించింది. షీనా తన సెల్‌ఫోన్‌ను వాడితే తాము కనుక్కుంటామని పోలీసులు వెల్లడించినట్టు కూడా ఇంద్రాణి పేర్కొంది. నీ నుంచి విడిపోవాలని షీనా భావించిదేమో.. డబ్బున్న మరో వ్యక్తి తనకు దొరికాడేమో అని రాహుల్‌ను ఇంద్రాణి ఓదార్చింది.. తన దగ్గర్నుంచి కూడా డబ్బులు రాబట్టుకున్నాక అసలు కాంటాక్టులోనే లేకుండా పోయిందని ఇంద్రాణి నాటకాలు ఆడింది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్లింది. షీనాను మరచిపోవాలని రాహుల్‌కు పీటర్, ఇంద్రాణి సూచించారు. షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్‌కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు. పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్‌కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు. -
వందేళ్ల కవలలు
బెల్జియం : నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని అందరూ కోరుకుంటారు. కాని మారుతున్న ఆహారపు అలవాట్లు, దానికి తోడు రకరకాల రోగాలు, కాలుష్యం వంటి కారణాలతో మనిషి జీవిత కాలం రానురానూ తగ్గిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 60 ఏళ్లు బతకడమే గగనమవుతోంది. అలాంటిది 100 ఏళ్లు బతకడమంటేనే ఆశ్చర్యం. కాని బెల్జియంకు చెందిన పీటర్, పౌలస్ లాంగ్రాక్ అనే ఇద్దరు కవల సోదరులు 103వ పడిలోకి అడుగుపెట్టారు. రెండు సంవత్సరాల్లో వీరు 105 ఏళ్లు బతికిన అమెరికాకు చెందిన కవల సోదరులు గ్లెన్, డేల్ మోయర్ రికార్డును బద్దలుగొట్టి, ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బతికిన కవలలుగా అవతరించబోతున్నారు. ఇప్పటికీ వారు ఒకరినొకరు వదిలి ఉండలేరు. అందుకే అన్నదమ్ములు పెళ్లి కూడా చేసుకోలేదు. వారు తమ పుట్టిన రోజును వారుండే నర్సింగ్ హోంలోనే ఆనందంగా జరుపుకున్నారు. వారి 103 ఏళ్ల అనుబంధాన్ని చూసి అన్నదమ్ములెవరైనా అసూయ పడాల్సిందే. -
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!
ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటో గ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50 వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5 లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు. ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటో గ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళ దుంప ఫొటోను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటు లభించింది. - పారిస్ -
హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు. అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్‌తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది. -
హర్యానా యువతిపై అత్యాచారం
హాలెండ్ వ్యక్తి అరెస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు నెట్ చాటింగ్‌లో పరిచయం 8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.