మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి‌! | Celina Jaitly pregnant with twins again! | Sakshi
Sakshi News home page

మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి‌!

Published Wed, May 24 2017 4:09 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి‌! - Sakshi

మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి‌!

ముంబై: నటి సెలీనా మరోసారి కవలలకు జన్మనివ్వబోతోంది. ఐదేళ్ల క్రితం తొలి కాన్పులో కవలలకు  జన్మనిచ్చింది సెలీనా. వారికి విన్‌స్టన్‌, విరాజ్‌ అని పేర్లు పెట్టింది. తాజాగా భర్త పీటర్‌తో కలిసి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి చెకప్‌ కోసం వెళ్లింది సెలీనా.

ఆమెకు వైద్య పరీక్షల్లో భాగంగా ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేస్తున్న సమయంలో ఈ సారి కూడా కవలలేనా? అని భర్త పీటర్‌ డాక్టర్‌ను ప్రశ్నించగా.. అవును! అని డాక్టర్‌ సమాధానం ఇచ్చారని సెలీనా తెలిపింది. ఆ మాట వినగానే భార్యభర్తలిద్దరూ ఒక్క క్షణంపాటు షాక్‌ తిన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయామని వివరించింది. త్వరలో ఓ యాడ్‌ షూట్‌ కోసం ఇండియా రానున్నట్లు వెల్లడించింది సెలీనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement