
నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్ కుమార్. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసిన పీటర్ పాల్ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది.
తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్‌గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కాగా లాక్‌డౌన్‌లో వనిత, పీటర్‌ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్‌ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు.
ఆతర్వాత సింగిల్‌గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్ డ్రాప్ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
#VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb
— Happy Sharing By Dks (@Dksview) June 27, 2020
Comments
Please login to add a commentAdd a comment