
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైడ్రోస్టాటిక్ లాక్, ఇంధన కల్తీ కారణంగా వాహనాల ఇంజన్‌లో ఊహించని వైఫల్యాలు తలెత్తుతుంటాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైతే మేమున్నామని భరోసా ఇస్తోంది మారుతి సుజుకీ ఇండియా. స్వల్ప మొత్తంతో కస్టమర్ కన్వీనియెన్స్ ప్యాకేజీని (సీసీపీ) ప్రకటించింది.
సీసీపీ కింద ఆల్టో, వేగన్–ఆర్ మోడళ్లకైతే రూ.500 చెల్లించాలి. ఇంజన్ పాడైతే మారుతి సుజుకీ అధీకృత సర్వీస్ సెంటర్ తీసుకెళితే చాలు. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా రిపేర్ చేసి ఇస్తారు. ‘రోడ్లపై వరద నీరు కారణంగా ఇంజన్ నిలిచిపోతోంది. అలాగే కల్తీ ఇంధన ప్రభావం కొన్నేళ్లుగా పెరుగుతోంది.
ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లకు సీసీపీ ఉపశమనం కలిగిస్తుంది’ అని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 2,100 నగరాలు, పట్టణాల్లో 4,200లకుపైగా సర్వీస్ టచ్ పాయింట్స్ ఉన్నాయి.
చదవండి: మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా..
Comments
Please login to add a commentAdd a comment