అగ్నిమాపక శాఖకు కొత్త హంగులు
అగ్నిమాపక శాఖకు కొత్త హంగులు
Published Thu, Apr 6 2017 12:02 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
అగ్నిమాపక శాఖను బహుళ విపత్తుల నివారణ సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కె.జయరామ్ నాయక్ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అగ్ని ప్రమాదాల నిరోధానికే కాకుండా ప్రకృతి విపత్తులు, వరదలు, ఆస్తి, ప్రజలను కాపాడే సంస్థగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సిబ్బందికి స్కిల్స్ డెవలప్‌మెంట్, అధునాతన యంత్రాలు, పరికరాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు రాష్ట్రంలో ఆరు వేల మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. ఫైర్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన, అధునాతన యంత్రాలు, పరికరాలు కొనుగోలుకు రూ.4 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించనున్నట్టు చెప్పారు. సిబ్బంది సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తారన్నారు. 228 అడ్వా¯Œ్సడ్ వాటర్ ట్యాంకులు, 56 బోట్లు ఉన్నట్టు తెలిపారు. రక్షణ పథకంలో సిబ్బంది, అధికారులకు రూ.3 లక్షల దాకా బెనిఫిట్ ఉండేదని, దాన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు పంపామన్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన రిస్క్యూ ఆపరేషన్, రోప్, లేడర్, కెమికల్ టూల్స్, సేండ్ కటర్, ఉడ్‌కట్టర్ తదితర విన్యాసాలు, వస్తు, యంత్రాలు, టూల్స్ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ టి.ఉదయ్‌కుమార్, అగ్నిమాపక శాఖ ఏడీ ఐ.ధర్మారావు, ఎస్‌ఎఫ్‌ఓ ఎం.రాజా పాల్గొన్నారు.
Advertisement