ట్రావెల్స్ బస్సులో మంటలు : బస్సు దగ్ధం
విజయవాడ: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు కృష్ణాజిల్లా కీసర సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి...ప్రయాణికులను కిందకు దించేశాడు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెనుప్రమాదం తప్పింది. లగేజి తీసుకునే సమయం కూడా లేకపోవడంతో కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్వూటే కారణమని తెలుస్తోంది. ప్రయాణికులను వేరే బస్సులో హైదరాబాద్కు తరలించారు.