
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి టెలికాం కంపెనీల డేటా ప్లాన్లకు దీటుగా తాజా ప్లాన్లను ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, టెలికాం సంచలనం జియో ఆఫర్లతో పోల్చితే దాని వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటాను అందించేలా ఆఫర్లను లాంచ్ చేసింది.
రూ. 186ల అతి తక్కువ ప్లాన్‌లను ప్రకటించింది. 180 రోజుల వాలిడిటీలో మొదటి 28రోజుల్లో రోజుకు 1 జీబీ డేటా అందిస్తుంది. రూ. 187 (జిఎస్టితో సహా) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ కింద రింగ్ టోన్‌తోపాటు, నేషనల్ కాల్స్(ముంబై, ఢిల్లీ మినహా) ఉచితం.రూ.485 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా(ముంబై, ఢిల్లీ మినహా) అందిస్తుంది. ఈ డేటా ప్రయోజనం తొలి 90రోజులకు మాత్రమే అలాగే అన్‌లిమిటెడ్‌కాల్స్ కూడా.
Comments
Please login to add a commentAdd a comment