
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్‌లను పునరుద్ధరించింద. కొత్త ప్లాన్‌లు కేవలం రూ.39 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్‌లతో 7 రోజులపాటు ఐఎస్‌డీ కాల్స్ చేసుకోవచ్చని, అత్యంత తక్కువ ధరలకు ఐఎస్‌డీ మినిట్స్ అందిస్తున్నట్లు జియో పేర్కొంది.
జియో బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా కోసం ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్ రేట్లను సవరించింది.
యూఎస్, కెనడా కోసం జియో ఐఎస్‌డీ ప్లాన్ రూ.39 నుండి ప్రారంభమవుతుంది. 7 రోజుల చెల్లుబాటుతో 30 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది. అదే విధంగా బంగ్లాదేశ్‌కు రూ.49 ప్లాన్ 20 నిమిషాల టాక్ టైమ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్‌లకు రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది.
ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు 15 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.69 రీఛార్జ్ ప్లాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లకు 10 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.79 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment