రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్‌లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.
వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్‌లను రూపొందించింది. కొత్త ఆఫర్‌లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
రూ. 1,028 ప్లాన్
జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అదనంగా సబ్‌స్క్రైబర్‌లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.
రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్‌షిప్ ఉంది. తరచుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్‌లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.
రూ. 1,029 ప్లాన్
జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌కి యాక్సెస్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment