సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బుధవారం ప్లాన్లను తీసుకొచ్చింది. ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ సరికొత్త తారిఫ్‌లను ప్రకటించింది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ ద్వారా జియో కస్టమర్‌లు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. నెలకు రూ.199 ప్లాన్‌నుంచి ఏడాదికి రూ. 2,199 తాజా ప్లాన్లు ఉండనున్నాయి.
న్యూ ఆన్‌ఇన్ వన్ ప్లాన్స్
ఆఫర్ ఏంటంటే..
అంతేకాదు పూర్తి ప్రయోజనాలకోసం డిసెంబర్ 6 కి జియో కస్టమర్లు తమ పాత రీఛార్జ్ ప్లాన్‌లను రీచార్జ్ చేసుకోవచ్చని సూచించింది. 336 రోజుల నిరంతరాయ సేవలతో 444 ప్లాన్‌తో నాలుగుసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుందనీ, ప్రతి రూ. 444 రీఛార్జ్ 84 రోజులు చెల్లుతుంది కాబట్టి, నాలుగు ప్లాన్‌లను కొనుగోలు చేస్తే మీకు 336 రోజుల సేవ లభిస్తుందని జియో వెల్లడించింది. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment