
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన కస్టమర్లకు హ్యాపీ న్యూఇయర్ కానుకలు తీసుకొచ్చేసింది. హ్యాపీ న్యూఇయర్ 2018 స్కీమ్ కింద రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఒకటి రూ.199 ప్లాన్. మరొకటి రూ.299 ప్లాన్. నేటి అర్థరాత్రి నుంచి జియో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
రూ.199 ప్లాన్ కింద ఉచిత వాయిస్, అపరిమిత డేటా(రోజుకు 1.2జీబీ హైస్పీడ్ 4జీ డేటా), అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు, జియో ప్రైమ్ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.
ఎక్కువ డేటా వాడే వారికోసం రూ.299 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద ఉచిత వాయిస్, అపరిమిత డేటా(రోజుకు 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా), అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు,జియో ప్రైమ్ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.
జియో ఇప్పటికే రూ.149 ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ ప్లాన్ కింద 28 రోజుల పాటు 4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. హ్యాపీ న్యూఇయర్ 2018 కింద తన కస్టమర్లకు ఈ రెండు సరికొత్త ప్లాన్లను యాడ్ చేస్తూ.. తన ప్యాకేజీ వివరాలను ప్రకటించింది.