Jio IUC New Plans in Telugu | దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్‌ ప్లాన్లు - Sakshi
Sakshi News home page

దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్‌ ప్లాన్లు

Published Mon, Oct 21 2019 2:32 PM | Last Updated on Mon, Oct 21 2019 2:52 PM

Reliance Jio launches new monthly recharge plans - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో  వచ్చినట్టు కనిపిస్తోంది.  ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో  ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ (మూడు  రీచార్జ్‌ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది.  ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది.  ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది.  దీంతోపాటు ఎప్పటిలాగే  జియో టు జియో అన్‌లిమిటెడ్‌  కాలింగ్‌ సదుపాయం. 

ఈ  కొత్త ప్లాన్స్‌ ఒక నెలకు  రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను  రూ. 111తో  అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448) తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది.  రూ. 396 (198x2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ. 333  మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్‌ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని  కొనాలంటే 80 రూపాయలు   వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది. 

కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement