సాక్షి,ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐ ఫోన్ 12, ఆ తకరువాతి మోడల్స్ స్మార్ట్‌ఫోన్లలో అపరిమిత 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఫోన్ యూజర్లకు వెల్కం ఆపర్ ప్రకటించింది ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చసింది.
5జీ సేవలను పొందేందుకు యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ iOS 16.2 కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని జియో తెలిపింది. ఐఫోన్12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్12 ప్రో, ఐఫోన్12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13, ఐఫోన్13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ 3(2022) తదితర ఫోన్లు ఉన్నాయని జియో ప్రకటించింది.
5జీకి ఎలా అప్‌డేట్ అవ్వాలి?
ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలోని iOS 16.2 , లేదా తరువాతి వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకొని, 'సెట్టింగ్‌లు' లో 5జీని ఆన్ చేసి, తరువాత 5జీ స్టాండలోన్‌ను ఆన్ చేయాలని జియో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment