యూత్‌ కోసం ఎల్‌ఐసీ కొత్త టర్మ్‌ ప్లాన్లు.. | LIC brings two new term insurance plans for youth full details | Sakshi
Sakshi News home page

యూత్‌ కోసం ఎల్‌ఐసీ కొత్త టర్మ్‌ ప్లాన్లు..

Published Fri, Aug 9 2024 1:59 PM | Last Updated on Fri, Aug 9 2024 4:20 PM

LIC brings two new term insurance plans for youth full details

భారత జీవిత బీమా సంస్థ (LIC) యువతను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను ప్రారంభించింది. ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, రిస్క్ ప్లాన్‌లు. లోన్ రీపేమెంట్ రిస్క్‌ల నుంచి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్‌లను రూపొందించారు. వీటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు ఇవే..
ఎల్‌ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్‌ ప్లాన్ల పేర్లు ఒకటి ఎల్‌ఐసీ యువ టర్మ్/డిజి టర్మ్, మరొకటి ఎల్‌ఐసీ యువ క్రెడిట్‌ లైఫ్‌/డిజి క్రెడిట్‌ లైఫ్‌.  వీటిని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు.

  • యువ టర్మ్/డిజి టర్మ్
    పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

  • గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది.

  • ఎల్‌ఐసీ యువ టర్మ్ మధ్యవర్తుల ద్వారా అందుబాటులో ఉంటుంది.

  • ఎల్‌ఐసీ డిజి టర్మ్ ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • ప్రవేశ వయసు కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 45 సంవత్సరాలు.

  • మెచ్యూరిటీ వయసు 33- 75 సంవత్సరాల మధ్య.

  • హామీ మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య.

  • డెత్‌ బెనిఫిట్స్‌ 
    రెగులర్‌, లిమిటెడ్‌ ప్రీమియం చెల్లింపు: వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% లేదా నిర్ణీత మొత్తం.

  • సింగిల్ ప్రీమియం చెల్లింపు: సింగిల్ ప్రీమియంలో 125% లేదా హామీ మొత్తం.

యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్
యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్‌లు రుణ బాధ్యతలకు కవరేజీని అందిస్తాయి. గృహ, విద్య లేదా వెహికల్‌ లోన్‌ వంటి వాటి రీ పేమెంట్‌ అవసరాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ ప్లాన్‌లు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

హామీ మొత్తం: రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్లు.

డెత్ బెనిఫిట్స్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, లోన్ బ్యాలెన్స్ ప్రకారం డెత్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఈ కొత్త ప్లాన్‌లు యువ వినియోగదారులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, లోన్ రిస్క్‌ల నుంచి రక్షణ పొందడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement