term insurance policies
-
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
యూత్ కోసం ఎల్ఐసీ కొత్త టర్మ్ ప్లాన్లు..
భారత జీవిత బీమా సంస్థ (LIC) యువతను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రారంభించింది. ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, రిస్క్ ప్లాన్లు. లోన్ రీపేమెంట్ రిస్క్‌ల నుంచి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్లను రూపొందించారు. వీటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఎల్ఐసీ కొత్త ప్లాన్లు ఇవే..ఎల్ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్ ప్లాన్ల పేర్లు ఒకటి ఎల్ఐసీ యువ టర్మ్/డిజి టర్మ్, మరొకటి ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్. వీటిని ఎల్ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు.యువ టర్మ్/డిజి టర్మ్‌పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది.ఎల్ఐసీ యువ టర్మ్ మధ్యవర్తుల ద్వారా అందుబాటులో ఉంటుంది.ఎల్ఐసీ డిజి టర్మ్ ఎల్ఐసీ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రవేశ వయసు కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 45 సంవత్సరాలు.మెచ్యూరిటీ వయసు 33- 75 సంవత్సరాల మధ్య.హామీ మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య.డెత్ బెనిఫిట్స్ రెగులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు: వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% లేదా నిర్ణీత మొత్తం.సింగిల్ ప్రీమియం చెల్లింపు: సింగిల్ ప్రీమియంలో 125% లేదా హామీ మొత్తం.యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్లు రుణ బాధ్యతలకు కవరేజీని అందిస్తాయి. గృహ, విద్య లేదా వెహికల్ లోన్ వంటి వాటి రీ పేమెంట్ అవసరాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ ప్లాన్లు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.హామీ మొత్తం: రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్లు.డెత్ బెనిఫిట్స్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, లోన్ బ్యాలెన్స్ ప్రకారం డెత్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఈ కొత్త ప్లాన్లు యువ వినియోగదారులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, లోన్ రిస్క్‌ల నుంచి రక్షణ పొందడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తాయి. -
టర్మ్ ప్లాన్స్.. అన్నీ ఒకటి కాదు!
జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణిలో మార్పు వస్తోంది. అయినా, ఇప్పటికీ అధిక శాతం మంది బీమా ప్లాన్‌ను రాబడి కోణం నుంచే చూస్తుంటారు. చివరిలో ఎంతొస్తుందని అడుగుతారు. అందుకే బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్లను ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంటారు. కానీ, బీమా అర్థం వేరు. ఒక వ్యక్తి మరణం కారణంగా కుటుంబం ఆరి్థకంగా కష్టాలు పడకుండా ఆదుకునే సాధనం ఇది. బీమా రక్షణను ఈ కోణంలోనే తీసుకోవాలి. అచ్చమైన బీమా కవరేజీ ఇచ్చేదే టర్మ్ ఇన్సూరెన్స్. కానీ, ఇందులోనూ పలు రకాలు ప్రవేశించాయి. నిక్షేపంగా జీవించి ఉంటే మాకేంటి..? అని ప్రశ్నించే వారి కోసం టర్మ్ ప్లాన్‌ను బీమా సంస్థలు వినూత్నంగా అందిస్తున్నాయి. కానీ, ఏది తీసుకోవాలి..? దీనికి సమాధానం కావాలంటే నిపుణుల విశ్లేషణ తెలుసుకోవాల్సిందే. తన కుటుంబ క్షేమం కోరేవారు తీసుకోవాల్సిన బీమా పాలసీ ఏదన్నా ఉందంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పాలి. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ ఇందులో లభిస్తుంది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఇందులో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో కట్టిన ప్రీమియం గంగపాలేనా? అని ఆలోచించే వారి కోసం బీమా సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. సగటు మనిషి ఆలోచనా తీరుకు అనుగుణంగా, చెల్లించిన ప్రీమియం చివర్లో వెనక్కి వచ్చే ఆప్షన్‌తోనూ టర్మ్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టాయి. అలాగే, పాలసీ గడువు ముగియకపోయినా కానీ, మధ్యలో వైదొలిగితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే రకాన్ని కూడా తీసుకొచ్చాయి. కానీ, పాలసీదారు తనకు నిజంగా ప్రయోజనకరమైన పాలసీ తీసుకున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. టర్మ్ పాలసీలో రకాలు టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది రెగ్యులర్ టర్మ్ ప్లాన్. దీన్నే లెవల్ టర్మ్ ప్లాన్ అని కూడా అంటారు. పాలసీదారులు తమ అభీష్టం మేరకు నిరీ్ణత వయసు వరకు (నిరీ్ణత కాలానికి) కవరేజీని తీసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు నూరేళ్ల కాలానికీ కవరేజీని ఆఫర్ చేస్తుంటే, కొన్ని గరిష్టంగా 85 ఏళ్లకే రక్షణను పరిమితం చేస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్‌లో రెండో రకం టీఆర్‌వోపీ. అంటే టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18 శాతం జీఎస్టీని మినహాయించి మిగిలినది వెనక్కిచేస్తాయి బీమా సంస్థలు. మూడో రకం జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు బీమా సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మిగిలిన రెండు రకాల కలయికగా ఇది ఉంటుంది. పాలసీ కాల వ్యవధిలోనే కట్టిన ప్రీమియంలు వెనక్కి ఇవ్వాలని కోరొచ్చు. వీటిల్లో మూడో రకం 2022 నుంచే అందుబాటులోకి వచి్చంది. మ్యాక్స్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తదితర సంస్థలు జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కాకుండా మిగిలిన రెండు రకాల పట్ల మొగ్గు చూపించేట్టు అయితే, ముందుగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. వ్యత్యాసాలు... రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్‌లో.. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు పాలసీదారు ఏ కారణంతో మరణించినా, పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారు. పరిహారం మొత్తాన్ని ఒకే విడత లేదంటే, వాయిదాలుగానూ తీసుకోవచ్చు. కేవలం ఈ రిస్క్ వరకే ఈ పాలసీ పరిమితం. గడువు ముగిసేలోపు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ తిరిగి రాదు. దీన్ని చౌక ప్లాన్‌గానూ చెబుతారు. కోటి రూపాయిల కవరేజీ సైతం 30 ఏళ్ల ఆరోగ్యకరమైన వ్యక్తికి రూ.12వేల కంటే తక్కువ వార్షిక ప్రీమియానికి వచ్చేస్తుంది. టీఆర్‌వోపీ (పాలసీ గడువు తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి వచ్చేవి) ప్లాన్‌లో పాలసీ గడువులోపు పాలసీదారు మరణించినట్టయితే నామినీకి పరిహారం వస్తుంది. పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18% జీఎస్టీని తగ్గించి ఇస్తారు. కానీ, రెగ్యులర్ టర్మ్ ప్లాన్లతో పోలిస్తే ఇవి ఖరీదుగా ఉంటాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే 2 రెట్ల వరకు అధిక ప్రీమియం వీటి కోసం చెల్లించాల్సి వస్తుంది. ఇలా అదనంగా వసూలు చేసే ప్రీమియంను సంప్రదాయ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, గడువు తీరిన తర్వాత పాలసీదారులకు బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి. అదనంగా చెల్లించే మొత్తం నుంచే తమ ప్రీమియం వెనక్కి వస్తుందన్న వాస్తవాన్ని పాలసీదారులు గుర్తించాలి. జీరో కాస్ట్ ప్లాన్‌లో పాలసీ గడువు కంటే ముందుగానే వైదొలగొచ్చు. ఒక వ్యక్తి తన ఆరి్థక బాధ్యతలు ముగిశాయని భావించినప్పుడు లేదంటే పదవీ విమరణ తర్వాత పాలసీ గడువు ఇంకా మిగిలి ఉన్నా వైదొలగడానికి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఇలా ముందస్తుగానే తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి 18% జీఎస్టీని మినహాయించి బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేస్తాయి. దీంతో పాలసీ రద్దయిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలకు ప్రయోజనం.. వృద్ధాప్యానికి వచి్చన పాలసీదారు తప్పు కోవడం వల్ల వాటికి క్లెయిమ్ రిస్క్ తగ్గుతుంది. వాస్తవం ఏంటి? జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే, ఎలాంటి చార్జీలు ఉండవని, దీన్నే చౌక ప్లాన్ అని పొరబడే అవకాశం లేకపోలేదు. ‘‘కొన్ని ప్లాన్లకు జీరోకాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే లేబుల్ వేయడం ఎందుకంటే.. ప్రత్యేకంగా వైదొలగడం, ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్ వల్లే. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనుసరించే మార్కెటింగ్ ఎత్తుగడల్లో భాగమే ఇది’’ అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రీమియం వెనక్కి వస్తుంది కనుక, జీరోకాస్ట్గా బీమా కంపెనీలు వీటిని వర్ణిస్తున్నాయి. అయినా, పాలసీదారు ఎప్పడంటే అప్పుడు పాలసీ నుంచి తప్పుకోవడం కుదరదని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ రిషబ్ గార్గ్ స్పష్టం చేశారు. కనీస కాల వ్యవధి ముగిసి, ఆరి్థక బాధ్యతలు తీరిన తర్వాతే ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘జీరో కాస్ట్ అనేది మైండ్ గేమ్. ఈ పాలసీ కోసం నేడు చెల్లించే ప్రీమియం విలువ, చివర్లో బీమా సంస్థ తిరిగిచ్చే ప్రీమియం కంటే చాలా ఎక్కువ’’అని వివరించారు. ఏమిటి మార్గం? టర్మ్ పాలసీ కాల వ్యవధి సాధారణంగా 30–40 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఉద్యోగం వచి్చన నాటి నుంచే జీవిత బీమా కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచన. కనుక రిటైర్మెంట్ వరకు తీసుకోవడం ఎంతో అవసరం. 60 ఏళ్ల నాటికి కూడా ఆరి్థక బాధ్యతలు తీరుతాయో, లేదో అన్న సందేహంతో 75 ఏళ్లు, 85 ఏళ్ల వరకు కూడా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని పాలసీల్లో వయసు ఆధారంగా ఫీచర్లను బీమా సంస్థలు పరిమితం చేస్తుంటాయి. జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఆరి్థక బాధ్యతలు తీరిన వెంటనే పాలసీ నుంచి వైదొలగొచ్చు. దీనివల్ల ప్రీమియంలు వెనక్కి వస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగియక ముందే ప్రీమియంల కోసం వైదొలగడం సరికాదు. దీనివల్ల జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. రెగ్యులర్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి ప్రీమియం ఎంత? ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్‌లో ప్రీమియం ఎంత? ఈ రెండింటి మధ్య అంతరం చెప్పుకోదగినంత ఉంటుంది. కనుక చివర్లో ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్ కాకుండా రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ మొత్తమే సమకూరుతుందని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐప్రొటెక్ట్ స్మార్ట్ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్’ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.కోటి కవరేజీ తీసుకునేట్టు అయితే ప్రీమియం రూ.16,287గా ఉంది. రెగ్యులర్ ప్లాన్‌లో ఇదే కవరేజీకి ప్రీమియం రూ.12,686. వ్యత్యాసం రూ.3,601. రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలే మొత్తాన్ని ప్రతి నెలా రూ.300 చొప్పున (ఏడాదికి రూ.3,600) ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 12 శాతం రాబడి అంచనా ప్రకారం 30 ఏళ్లకు రూ.10.5 లక్షలు సమకూరుతుంది. రిస్క్ తీసుకోని డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసుకున్నా రూ.4.5 లక్షలు సమకూరుతుంది. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ ప్లాన్ సైతం జీరోకాస్ట్గానే సమకూరుతుంది. ఇక్కడ చెప్పుకున్నట్టు జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ కోసం ఏటా రూ.16,287 చొప్పున 30 ఏళ్లలో రూ.4.89 లక్షలు చెల్లించుకోవాలి. చివరి వరకు జీవించి ఉంటే, చెల్లించిన మొత్తం నుంచి 18 శాతం జీఎస్టీ మినహాయిస్తారు. అప్పుడు చేతికి వచ్చేది రూ.4 లక్షలు. ఇక కనిపించని చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. మరి అవే ప్రీమియంలు వెనక్కి వచి్చనప్పుడు పన్ను వర్తించొచ్చు. ఇతర రకాలు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్.. ఏటా కవరేజీ పెరిగే ప్లాన్‌కు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా 60–65 ఏళ్లకు వచ్చే సరికి ఆరి్థక బాధ్యతలు తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్లో ఏటా నిరీ్ణత శాతం మేర సమ్ అష్యూరెన్స్ తగ్గుతూ వెళుతుంది. ఇందులోనూ ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. ఇతర ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం తక్కువ. లమ్సమ్, పీరియాడిక్ పేమెంట్స్.. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత చెల్లించేవి లమ్సమ్. ఒకేసారి అంత మొత్తం చేతికి వస్తే, దాన్ని ఆదాయంగా మలుచుకోవడం సమస్యగా భావించేవారు, పీరియాడిక్ పేమెంట్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించిన సందర్భంలో పరిహారాన్ని నెలవారీ చొప్పున పదేళ్ల పాటు చెల్లించేలా ఎంపిక చేసుకోవచ్చు. సగం పరిహారం ఏక మొత్తంలో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంపిక చేసుకున్న కాలానికి అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి టర్మ్‌ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. 70 ఏళ్లకు వచ్చే సరికి టర్మ్ ప్లాన్ ముగిసిపోతుంది. అప్పుడు కావాలంటే దాన్ని మరింత కాలానికి బీమా పాలసీ కింద మార్చుకోవచ్చు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. లిమిటెడ్ పే, సింగిల్ పే.. రెగ్యులర్ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న కాలం అంతటా నిరీ్ణత రోజులకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తుండాలి. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో ఆరంభంలోనే ఒకసారి ప్రీమియం చెల్లించాలి. రెగ్యులర్‌గా ప్రీమియం కట్టే వెసులుబాటు లేని వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇక లిమిటెడ్ పే ప్రీమియం ప్లాన్‌లో.. పాలసీ కాల వ్యవధి అంతటా కాకుండా, కొన్నేళ్ల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్లు వచ్చే వరకు 50 ఏళ్ల కాలానికి టర్మ్ ప్లాన్ ఎంపిక చేసుకున్నాడని అనుకుందాం. 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా భావిస్తే లిమిటెడ్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 5–10–15 ఏళ్లు ఇలా లిమిటెడ్ పేలో ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధి ఉంటుంది. -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి చాలదా..?
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి. కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు. వయసు ఆధారంగా.. వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే. ఎక్కువ ప్లాన్లు ఎందుకు? ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు. అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది. రుణ భారం అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్ఎల్వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్ఎల్వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది. భారం దించుకోవచ్చు.. అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి. -
ప్రియమైన వారికి అమూల్య బహుమతి
ముఖ్యమైన పండుగలు, పుట్టిన రోజు.. ఈ తరహా ప్రత్యేక సందర్భాల్లో కొందరు అపురూప కానుకల ద్వారా తమకు అత్యంత సన్నిహితులను సంతోషానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంటారు. ఇందుకోసం ఖరీదైన కార్లు, బంగారం, వజ్రాభరణాలు, ఫ్లాట్ లేదా విల్లా ఈ తరహా కానుకలను ఇచ్చే వారు ఉన్నారు. కానీ, ఈ తరహా భౌతిక కానుకలు కాకుండా, మీరు నిజంగా అభిమానించే వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు వినూత్నంగా బీమా పాలసీని బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు..? ఆలోచించండి. ఒక వ్యక్తి అకాల మరణంతో సంబంధిత కుటుంబం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమయంలో బీమా పాలసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. కనుక జీవిత బీమా పాలసీని ఇవ్వడం నిజంగా అపురూపమైన కానుకే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే మరణానికి పరిహారం ఇచ్చే ఉద్దేశ్యంతో కూడినది. పాలసీ కాల వ్యవధి ముగిసిపోయే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ, పాలసీ కాల వ్యవధి సమయంలో అకాల మరణానికి గురైతే నామినీకి సమ్ అష్యూరెన్స్‌ను పరిహారం కింద చెల్లించడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్‌లో రూ.కోటి సమ్ అష్యూరెన్స్ (బీమా రక్షణ మొత్తం)కు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని గమనించాలి.. బీమా పాలసీని కానుకగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇతర ఉత్పత్తుల వైపు ఆలోచన వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే, బండిల్డ్ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించాలి. బీమా రక్షణకు, పెట్టుబడి ఇతర ఆప్షన్లను జోడించి ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాలను కంపెనీలు చేస్తుంటాయి. కానీ, వీటిల్లో ఉండే అనేక రకాల చార్జీలతో బీమా కంపెనీలకే ప్రయోజనం ఎక్కువ. ఈ చార్జీల కారణంగా పాలసీదారులకు చివర్లో దక్కేది తక్కువే. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు గట్టిగా 4–5 శాతం మించి రాబడులను ఇవ్వలేవు. ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ లింక్డ్ బీమా పథకాల్లో (యులిప్) రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులకు హామీ ఉండదు. అధిక రిస్క్ తీసుకునే వారికి యులిప్ పాలసీలు పెట్టుబడి ఆప్షన్ అవుతాయి. కానీ, టర్మ్ పాలసీలతో పోలిస్తే అసలైన బీమా ప్రయోజనం వీటిల్లో తక్కువే. ఇక పాలసీ ఎంపిక విషయంలో బీమా కంపెనీ, బీమా మొత్తం, బీమా కాల వ్యవధి, ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి వీటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి. బీమా ఎంత? ఎంత మొత్తం బీమా తీసుకోవాలనే విషయంలో ఓ సాధారణ సూత్రం ఉంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకుంటే, పది రెట్ల మేర రూ.60 లక్షలకు బీమా కవరేజీని తీసుకోవడం అవసరం. అయితే, సంబంధిత వ్యక్తి పేరిట ఉన్న అప్పులు, కుటుంబ జీవన శైలి ఆధారంగా ఈ మొత్తం మారిపోతుంది. ఏమైనా రుణ భారం ఉంటే ఆ మేరకు అదనంగా బీమా కవరేజీ అవసరం. ఇక పాలసీ కాల వ్యవధిని నిర్ణయించే ముందు ఎంత కాలం పాటు ఇంకా ఆ వ్యక్తి పనిచేయగలరన్నది కీలకం అవుతుంది. ఎందుకంటే కుటుంబానికి సంబంధిత వ్యక్తి ఆర్జన అవసరమైనంత కాలం మేర బీమా రక్షణ ఉంటే సరిపోతుంది. ప్రీమియంలపై ప్రత్యేక దృష్టి... బీమా కంపెనీలు 80 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణను ఆఫర్ చేస్తున్నాయి. ఆలస్యంగా వివాహం అవడం, ఆలస్యంగా సంతానం కలిగిన వారికి రిటైరైన తర్వాత కూడా కొంత కాలం వరకు బీమా రక్షణ అవసరంపడొచ్చు. బీమా ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి కూడా కీలకమైనదే. బీమా కంపెనీలు పరిమిత కాలం పాటు చెల్లింపు, పూర్తి కాలం పాటు చెల్లింపు ఆప్షన్లు ఇస్తుంటాయి. పరిమిత కాలం ఆప్షన్లో 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 5/10/15 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం ఇవ్వొచ్చు. ఇటువంటి సందర్భాల్లో చెల్లించే ప్రీమియం మొత్తం అధికంగా ఉంటుంది. కొనుగోలు ఏ రూపంలో..? ఆన్లైన్లో అయితే బీమా పాలసీని తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. దీనితో ఏజెంట్ల కమీషన్ భారం ఉండదు. అన్ని బీమా కంపెనీలు తమ అధికారిక వెబ్ పోర్టళ్ల ద్వారా ఆన్లైన్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకటికి మించిన బీమా కంపెనీల మధ్య ప్రీమియం పరంగా అంతరం, ప్రయోజనాల వైరుధ్యం తెలుసుకుని మంచి పాలసీని ఎంచుకునేందుకు పాలసీబజార్ డాట్ కామ్ పోర్టళ్లు అనుకూలంగా ఉంటాయి. పేరు, వయసు, ఎంత కాలానికి బీమా కవరేజీ కావాలి, ఎంత మొత్తం అనే వివరాలను పోర్టళ్లలో ఇవ్వడం ద్వారా ప్రీమియం ఎంతన్న కొటేషన్ చూసుకోవచ్చు. నచ్చితే అక్కడి నుంచే తదుపరి, పాన్, ఇతర ఆరోగ్య వివరాలు, చిరునామా, కాంటాక్ట్ సమాచారం ఇవ్వడం ద్వారా అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనికి 10–15 నిమిషాలకు మించి పట్టదు. చివర్లో ప్రీమియం చెల్లించినట్టయితే, కంపెనీ సిబ్బంది మీకు కాల్ చేసి తదుపరి వివరాలు కోరతారు. కొన్ని కంపెనీలు ఆరోగ్య పరీక్షల అనంతరం బీమా పాలసీని జారీ చేస్తాయి. కొనుగోలుకు ముందు ముఖ్యంగా బీమా కంపెనీని ఎంచుకునే ముందు, క్లెయిమ్స్ హిస్టరీని పరిశీలించాలి. అంటే ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బీమా పరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఎన్నింటికి కంపెనీ పరిహారం చెల్లించింది, ఎన్నిటిని తిరస్కరించింది, అలాగే ఎన్ని అపరిష్కృతంగా ఉన్నాయనే వివరాలను ఐఆర్డీఏఐ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. చెల్లింపుల హిస్టరీ మెరుగ్గా ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చిన క్లెయిమ్స్ పట్ల బీమా కంపెనీ ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలుస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త... ఒకరి పేరిట బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడమే కాదు... సంబంధిత వ్యక్తి మరణిస్తే పరిహారం దక్కే విషయంలో తగిన రక్షణ కల్పించడం కూడా అవసరం. బీమా పాలసీ కలిగిన వారు మరణించిన సందర్భాల్లో, వారి పేరిట రుణాలు ఉంటే, ఆ పరిహారం తాము స్వాధీనం చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోర్టులను ఆశ్రయించొచ్చు. అదే జరిగితే వాటికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇవ్వొచ్చు. ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు, జీవిత బీమా పాలసీని వివాహిత మహిళా ఆస్తి చట్టం (ఎండబ్ల్యూపీ) కింద రిజిస్టర్ చేయాలి. ఇలా చేసిన పాలసీ విషయంలో క్లెయిమ్ హక్కును సంబంధిత వ్యక్తి జీవిత భాగస్వామి లేదా పిల్లలు మాత్రమే కలిగి ఉంటారు. కనుక బీమా పాలసీ కొనుగోలు సమయంలోనే దానిని ఎండబ్ల్యూపీ చట్టం కింద తీసుకోవాలి. ఒక్కసారి పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి వీలు పడదు. -
ఒక్కో లక్ష్యానికి ఒక్కో ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా?
నా వయస్సు 35 సంవత్సరాలు. సొంత ఇంటిని సమకూర్చుకోవడం, నా పాపను డాక్టర్ చదివించడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపటానికి కావలసిన నిధిని సమకూర్చుకోవడం... నా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ మూడు లక్ష్యాల కోసం మూడు వేర్వేరు ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? ఎన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటే అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? వివరించగలరు. –సుందర్, విశాఖపట్టణం ఎన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటే అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అలోచన మంచిదే. కానీ వివిధ ఆర్థిక లక్ష్యాల కోసం వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సొంత ఇంటిని సమకూర్చుకోవడం, మీ పాపను ఎంబీబీఎస్‌ను చదివించడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపటానికి కావలసిన నిధిని సమకూర్చుకోవడం...ఈ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం వేర్వేరు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి లేదా రెండు మంచి ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లోనే సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కావలసిన ఆర్ధిక వనరులను మీరు పొందగలరు. నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను, వాటిల్లో నష్టాలు వచ్చాయి. ఈ డెట్ ఫండ్స్ సమీప కాలంలో కోలుకునే అవకాశాలు ఉన్నాయా? లేకుంటే ఈ డెట్ ఫండ్స్ నుంచి వైదొలగమంటారా? తగిన సూచనలివ్వండి. –లక్ష్మీరాజ్, హైదరాబాద్ డెట్ ఫండ్స్ కోలుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి. మెచ్యురిటీ కాలం అధికంగా ఉన్న డెట్ ఫండ్స్‌కు ఇటీవలిS కాలంలో బాగానే నష్టా లు వచ్చాయి. అయితే ఈ ఫండ్స్ రికవరీ అయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. మీరు డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఈ ఫండ్స్ రికవరీ కావడానికి 4–5 నెలల సమయం పడుతుంది. ఒకవేళ మీరు షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలన్నర కాలంలోనే మీ ఇన్వెస్ట్మెంట్స్ రికవరీ అవుతాయి. ఆల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్స్ ఇప్పటికే రికవరీ బాట పట్టాయి. లిక్విడ్ ఫండ్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదు. మొత్తం మీద 1–6 నెలల కాలవ్యవధిలో డెట్ ఫండ్స్ రికవరీ అవుతాయని అంచనా వేస్తున్నాం. మీరు కనుక ఏడాది క్రితం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలే లేవు. పైగా ఒకింత లాభాల్లో ఉండి ఉంటారు. మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మిడ్‌క్యాప్ ఫండ్స్.. తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంత శాతం మిడ్‌క్యాప్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి ? –సుధీర్, నిజామాబాద్ సాధారణంగా చాలా మిడ్–క్యాప్ ఫండ్స్,.. మిడ్ క్యాప్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే కొన్ని మిడ్‌క్యాప్ ఫండ్స్ లార్జ్ క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను తీసుకుంటే, ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కేటాయింపుల్లో 30 శాతం వరకూ లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఉన్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఎక్కువ సంఖ్యలో ట్రేడ్ కావడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు మార్కెట్ కష్ట సమయంలో ఉన్నప్పుడు మిడ్–క్యాప్ షేర్లను విక్రయించడం చాలా కష్టసాధ్యమైన విషయం. దీంతో పలు మిడ్ క్యాప్ ఫండ్స్‌కు నష్టాలు తప్పవు. దీనిని నివారించడానికి పలు మిడ్–క్యాప్ ఫండ్స్ 10–30 శాతం రేంజ్లో లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. భారత స్టాక్ మార్కెట్లో మిడ్‌క్యాప్ కంపెనీలు 330 వరకూ ఉంటాయని అంచనా. తమ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తంలో ఇలాంటి మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో 60 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మిడ్‌క్యాప్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎన్ఎఫ్ఓను తెచ్చిందనుకోండి. దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ యే విషయాలు చూడాలి ? –అంజాద్, హైదరాబాద్ అసలు న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. కాదు కూడదు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం.. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎన్ఎఫ్ఓను అందుబాటులోకి తెచ్చిందనుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ ట్రాక్ రికార్డ్ ఏమిటి ? ఈ ఎన్ఎఫ్ఓను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఎవరు ? ఈ ఎన్ఎఫ్ఓ విధి విధానాలు ఏమిటి అనే విషయాలు చూడాలి. దీనికంటే కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌నే ఎంచుకొని ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. వాటిల్లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఎన్ఎఫ్ఓ పనితీరు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. అదే అప్పటికే రంగంలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పనితీరును మదింపు చేయడానికి ఆ ఫండ్ ట్రాక్ రికార్డ్‌ను చూస్తే సరిపోతుంది. గత కొన్నేళ్లలో ఆ ఫండ్ ఏ మేరకు రాబడులనిచ్చిందో పరిశీలించి భవిష్యత్తులో ఏ మేరకు రాబడులు వస్తాయో అంచనా వేయడం సులభమే. అదే ఎన్ఎఫ్ఓలో ఆ అవకాశం ఉండదు. అందుకని ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది అని మేము భావిస్తాం. -
ఎక్కువ ఆస్తులు ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవాలా?
నా వయసు 52 సంవత్సరాలు. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ పాలసీలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా ? వివరించండి. –చంద్ర శేఖర్, విజయవాడ ఎల్ఐసీ జీవన్ అక్షయ్ సిక్స్ ప్లాన్.. ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్‌లో మీరు ఒక్కసారే ప్రీమియమ్ చెల్లిస్తే, మీరు జీవించి ఉన్నంత కాలం మీకు నెలవారీ లేదా మూడు నెలలకొకసారి లేదా ఆరు నెలలకొకసారి లేదా ఏడాదికొకసారి నిర్దేశిత మొత్తం అందుతుంది. చివర్లో మీరు చెల్లించిన ప్రీమియమ్ కూడా అందుకునే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు పొందే నెలవారీ/మూడు నెలలకొకసారి/ఆరు నెలలకొకసారి/ఏడాదికొకసారి పొందే నిర్దేశిత మొత్తం తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనే దానిపై గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఈ యాన్యుటీ ప్లాన్ మీకు క్రమం తప్పని గ్యారంటీ ఆదాయాన్నిస్తుంది కానీ, ఇవి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేవు. ఇలాంటి సాంప్రదాయ యాన్యుటీ ప్లాన్లను వదిలివేయడమే మంచిది. ఈ ప్లాన్ కంటే కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్‌లు కొంత మెరుగైన రాబడులనిస్తాయి. నేను టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎల్ఐసీ నుంచి రూ.50 లక్షలకు, మరో సంస్థ నుంచి రూ. కోటికి టర్మ్ బీమా పాలసీలు తీసుకోవాలనేది నా ప్లాన్. ఈ రెండింటిలో ఒకదానిని యాక్సిడెంటల్ డిజెబిలిటీ ఆప్షన్ ఉన్న టర్మ్ పాలసీని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నాకు తగిన సూచనలివ్వండి. –పరమేశ్, విశాఖపట్టణం భారీ మొత్తంలో టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే, ఈ పాలసీని ఒక్క సంస్థ నుంచి కాకుండా రెండు బీమా సంస్థల నుంచి తీసుకోవడం మంచి పని. పర్మనెంట్, పార్షియల్ డిజెబిలిటీ రైడర్లు ఉన్న టర్మ్ పాలసీ తీసుకుంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా యాక్సిడెంట్ కారణంగా మీరు సంపాదించలేని స్థితికి చేరుకున్నారనుకోండి. 5–10 ఏళ్ల పాటు మీరు బీమా చేసిన మొత్తంలో కొంత శాతం మీకు అందుతుంది. యాక్సిడెంట్ కారణంగానే మీరు సంపాదించలేని స్థితిని చేరుకుంటేనే ఈ రైడర్ పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఈ రైడర్స్‌ను ఎంచుకునేటప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మీ వ్యక్తిగత అవసరాలను బట్టి పాలసీలను, రైడర్లను ఎంచుకోవాలి. ఇక ఏ సంస్థ నుంచి పాలసీ తీసుకోవాలి అనే విషయానికొస్తే, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర ప్రైవేట్ బీమా సంస్థల ప్రీమియమ్‌లతో పోల్చితే ఎల్ఐసీ టర్మ్ ప్లాన్ ప్రీమియమ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లను పరిగణనలోకి తీసుకుంటే, దిగువ పేర్కొన్న సంస్థల టర్మ్ బీమా పాలసీలను పరిశీలించవచ్చు. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్,, హెచ్డీఎఫ్సీ లైఫ్క్లిక్2 ప్రొటెక్ట్ ప్లాన్... ఈ ప్లాన్లను ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్లాన్లన్నింటిని ప్రీమియమ్‌లను పరిశీలించి, మీ బడ్జెట్‌కు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోండి. ఈ ప్లాన్ల దరఖాస్తులను నింపేటప్పుడు అన్ని వివరాలు సమగ్రంగా ఇవ్వండి. క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు(అసెట్స్ అండర్ మేనేజ్మెంట్–ఏయూఎమ్)ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మిత్రులు సలహా ఇస్తున్నారు. మీరేమంటారు ? –జాన్సన్, హైదరాబాద్ మీ మిత్రులు ఇచ్చిన సలహా సరైనదే. అధిక మొత్తం నిర్వహణ ఆస్తులు ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా సందర్భాల్లో మంచి ప్రయోజనాలే లభిస్తాయి. మీరు లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, లిక్విడిటీ కూడా బాగా ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవాలి. అదే లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి. నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్న పెద్ద ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ లార్జ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు చార్జీల భారం తక్కువగా ఉంటుంది. మరోవైపు ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు ఈ లార్జ్ ఫండ్స్‌కు తట్టుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఫండ్స్ ఆస్తుల విలువ పెరుగుతున్న కొద్దీ అది నిష్ప్రయోజనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఆస్తులు పెరిగితే అది ఆయా ఫండ్స్‌కు ఎలాంటి ప్రయోజనం కలిగించదు. అయితే మల్టీ, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆస్తులు రూ.10,000–20,000 కోట్ల సైజ్‌కు చేరినా, ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. కొన్ని ఫండ్స్ సైజ్‌తో సంబంధం లేకుండా మంచి పనితీరు కనబరచవచ్చు. మరోవైపు ఏదైనా ఫండ్ నుంచి పెద్ద ఇన్వెస్టర్ వైదొలిగితే.. అది చిన్న సైజు ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.అదే ఆస్తులు అధికంగా ఉన్న ఫండ్ అనుకోండి. ఈ ప్రభావం పెద్దగా ఉండదు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫండ్స్ ఆస్తులతో పాటు ఆ ఫండ్ ట్రాక్ రికార్డ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోండి. మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని, ఆ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.