
ఓటీటీ యూజర్లకు డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్తను అందించింది. యూజర్లను పెంచుకోవడం కోసం డిస్నీ+హాట్‌స్టార్ తాజాగా కొత్త సబ్‌స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. డిస్నీ+హాట్‌స్టార్ ప్రస్తుతం వీఐపీ సేవలను సంవత్సరానికి రూ. 399 అందిస్తుండగా, డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియమ్ సేవలను రూ. 1499కు అందిస్తోంది.
తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ రూ.499లకు కొత్త మొబైల్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సేవలను పొందవచ్చును. కాగా ఈ కొత్త ప్లాన్ కేవలం ఒక్క యూజర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో హెచ్‌డీలో వీడియోలను చూడవచ్చును. డిస్నీ+హాట్‌స్టార్ మరో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ. 899ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌తో ఇద్దరు యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్ సేవలను ఒకేసారి పొందవచ్చును.
మూడో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర సంవత్సరానికి రూ. 1,499 ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఒకేసారి నలుగురు యూజర్లు ఒకేసారి వీడియోలను చూడవచ్చును. అంతేకాకుంగా 4కే స్ట్రీమింగ్ కూడా మద్దతు ఇస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న వీఐపీ ప్లాన్ రూ. 399, నెలకు రూ. 299 డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment