అపరిమిత డేటాతో వొడాఫోన్‌ కొత్త ప్లాన్స్‌ | Vodafone's New Rs. 409, Rs. 459 Prepaid Packs Offer Unlimited 2G Data   | Sakshi
Sakshi News home page

అపరిమిత డేటాతో వొడాఫోన్‌ కొత్త ప్లాన్స్‌

Published Mon, Dec 18 2017 6:43 PM | Last Updated on Mon, Dec 18 2017 6:43 PM

Vodafone's New Rs. 409, Rs. 459 Prepaid Packs Offer Unlimited 2G Data   - Sakshi

వొడాఫోన్‌ కొత్తగా తన ప్రీపెయిడ్‌ యూజర్లకు రెండు సూపర్‌ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఎంపిక చేసిన సర్కిళ్లు మధ్యప్రదేశ్‌,  చత్తీష్‌గఢ్‌‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌ అండ్‌ జార్ఖాండ్‌, జమ్ము, కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ యూజర్లకు కొత్తగా ఈ రూ.409, రూ.459 ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌ ప్యాక్స్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత 2జీ డేటాను ఆఫర్‌ చేయనుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు ప్యాక్‌లకు మధ్య ఉన్న తేడా వాలిడిటీ మాత్రమే. రూ.409 ప్లాన్‌ను 70 రోజుల వ్యవధిలో అందిస్తుండగా.. రూ.459 ప్లాన్‌ను 84 రోజుల కాలానికి గాను అందిస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ప్యాక్‌లను మైవొడాఫోన్‌ యాప్‌, ఇతర ఆఫ్‌లైన్‌ వొడాఫోన్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ఈ ప్యాక్‌లు అందుబాటులో ఉన్న సర్కిల్స్‌లో వొడాఫోన్‌ 3జీ కవరేజ్‌ లేదు.  జమ్ము, కశ్మీర్‌ సర్కిల్‌లో ఈ రెండు ప్యాక్‌లు ఇంకా తక్కువ ధరలకే లభించనున్నాయి. రూ.409 ప్లాన్‌ రూ.359కు, రూ.459 ప్లాన్‌ కేవలం రూ.409కే అందుబాటులో ఉంది. వొడాఫోన్‌ ఇటీవలే మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సర్కిల్‌ వినియోగదారులకు రూ.176 ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద అపరమిత రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ను అందిస్తోంది. అంతేకాక రోజుకు 1జీబీ డేటాను 28 రోజుల పాటు ఆపర్‌ చేస్తోంది. రూ.79 నుంచి రూ.509 మధ్యలో కూడా ఐదు సూపర్‌ ప్లాన్లను వొడాఫోన్‌ ఈ నెల మొదట్లో లాంచ్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement