APSFL Introduced New Packages For Ys Jagan Mohan Reddy Birthday Special - Sakshi
Sakshi News home page

దేశంలోనే వైఎస్‌ జగన్‌ అరుదైన రికార్డ్‌.. త్వరలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్లు

Published Wed, Dec 21 2022 5:41 PM | Last Updated on Wed, Dec 21 2022 7:25 PM

Apsfl Introduced New Packages For Ys Jagan Mohan Reddy Birthday - Sakshi

ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. 

రూ.190 రూపాయలకే 20 ఎంబీపీఎస్(mbps) స్పీడ్ తో 400 జిబి (జీబీ) ఇంటర్నెట్‌ ఇవ్వాలని నిర్ణయం

రూ.190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సెట్ టాప్ బాక్స్  

రూ.249 కే 50..ఎంబీపీఎస్‌ స్పీడ్ తో 600 జీబీ ఇంటర్నెట్ 

రూ.295 రూపాయలకు ఎఫ్‌టీఏ ఛానల్స్‌, 15ఎంబీపీఎస్‌ స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ 

ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ లో త్వరలో  OTTలు 

రూ.299, రూ.399,రూ.799 రూపాయలతో ఒటీటీ ,ఇంటర్నెట్ ,టెలిఫోన్ సదుపాయం 

రూ.499,రూ.699,రూ.999.. రూపాయలకే ఒటీటీతో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తుండగా 

మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం
మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపు, ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ను ప్రజలందరికి చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

వైఎస్‌ జగన్‌ సరికొత్త రికార్డులు 
ఆధునాత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేబుల్‌, ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవల ప్రాధాన్యం పెరిగింది. కేబుల్‌తో పాటు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ తీసుకోవడం కూడా ఇటీవలి కాలంలో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. ఫోన్‌ సదుపాయం ఎప్పడో తప్పనిసరిగా మారింది. కానీ.. ఈ మూడిటికీ అయ్యే ఖర్చు మాత్రం వినియోగదారులకు భారమే. ఈ నేపథ్యంలో మూడు రకాల సేవలనూ కేబుల్‌, ఇంటర్నెట్‌, ఫోన్‌,వాయిస్‌, డేటా సేవల్ని ఒకే గొడుకు కిందకు తెచ్చి, అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. దేశంలో హైస్పీడ్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌ వర్క్‌ సేవలను అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్‌ జగన్‌ రికార్డ్‌ సృష్టించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement