స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత మంది డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. రికవరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) వంటి వినూత్న పథకాలను పరిచయం చేయనుంది. ఆర్థికంగా ఎదగాలనుకునేవారు.. కొన్ని విభిన్న పెట్టుబడి ఎంపికల కోసం చూస్తారు. అలాంటి కస్టమర్ల అభివృద్ధి కోసం ఎస్‌బీఐ చర్యలు తీసుకుంటోందని చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలామంది పొదుపు చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ.. లాభాలనే కోరుకుంటారు. రిస్క్ ఉన్న వాటికంటే కూడా.. వారి పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే రంగాలవైపు సుముఖత చూపుతారు. కాబట్టి అలాంటి వారి కోసం కొత్త బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాలని సీఎస్ శెట్టి అన్నారు.
కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్‌బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు పేర్కొన్నారు.
డిపాజిట్లను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచడానికి కూడా యోచిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ వివరించారు. డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్, వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శెట్టి చెప్పారు. కాబట్టి సమతుల్య వడ్డీ రేట్లు, ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్‌బీఐ దృష్టి ఉందని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో కూడా గణనీయమైన పురోగతి సాధించిన ఎస్‌బీఐ ప్రతిరోజూ 50000 నుంచి 60000 సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తోందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment