జియో ఫైబర్ : 30 రోజులు ఫ్రీ ట్రయల్ | JioFiber announces 30-day free trial for all new users | Sakshi
Sakshi News home page

జియో ఫైబర్ : 30 రోజులు ఫ్రీ ట్రయల్

Published Mon, Aug 31 2020 2:16 PM | Last Updated on Mon, Aug 31 2020 3:57 PM

JioFiber announces 30-day free trial for all new users - Sakshi

సాక్షి,ముంబై: రిలయన్స్ జియో ఫైబర్  బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ప్రకటించింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్  బ్రాడ్‌బ్యాండ్  వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి  జియోఫైబర్  కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నె లరోజులుపాటు  ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది  వీరితోపాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్  పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది.  అలాగే 999, 1499  ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల  (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ) చందా ఉచితం. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్  ఒక  ప్రకటనలో వెల్లడించింది.

కొత్త జియోఫైబర్ ప్రణాళికలు  ప్రయోజనాలు
అపరిమిత ఇంటర్నెట్
సిమెట్రిక్ స్పీడ్ (అప్‌లోడ్ వేగం = డౌన్‌లోడ్ వేగం)
నెలకు 399 నుండి ప్రారంభమయ్యే ప్రణాళికలు
అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 ఓటీటీ యాప్స్  ఉచితం
జియోఫైబర్ నో-కండిషన్ 30 రోజుల  ఉచిత ట్రయల్
150 ఎంబీపీసెస్  అపరిమిత ఇంటర్నెట్
4కే  సెట్ టాప్ బాక్స్
ఉచిత వాయిస్ కాలింగ్
నచ్చకపోతే,  (ఎలాంటి ప్రశ్నలు  సమాధానం చెప్పాల్సిన అవసంర లేకుండానే) ప్లాన్ వెనక్కి తీసుకోవచ్చు.

జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ 
399  రూపాయల ప్లాన్ లో  30 ఎంబీపీఎస్  స్పీడ్
699 రూపాయల ప్లాన్ లో  100 ఎంబీపీఎస్ స్పీడ్
999  రూపాయల ప్లాన్ లో  150 ఎంబీపీఎస్ స్పీడ్
1,499 రూపాయల ప్లాన్ లో300 ఎంబీపీఎస్  స్పీడ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement