free offer
-
మూడు లీటర్ల పెట్రోలు, డీజిల్ ఫ్రీ: డీలర్లు గగ్గోలు
తిరువనంతపురం: దేశంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు అటు వాహనదారులకు, ఇటు రవాణా సంస్థలకు, ఆటో డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆటోడ్రైవర్లకు బంపర్ ఆఫర్ లభించింది. కేరళలోని ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద మూడు లీటర్ల పెట్రోలును ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది. కర్ణాటక-కేరళ సరిహద్దులోని ఎన్మకాజే గ్రామ పంచాయతీలోని పెర్లాలోని ఫ్యూయల్ స్టేషన్ యజమాని ఆటోవాలాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 311 మందికి మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా అందజేశారు. ఈ విషయాన్ని పెట్రోలు పంపు యజమాని అబ్దుల్లా మధుమోల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన గ్రామంలో కేవలం 100ఆటోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ, చాలా దూర ప్రాంతాలనుంచి వచ్చి తమ ఉచిత ఆఫర్‌ను వినియోగించుకున్నారన్నారు. అంతేకాదు ఆ ఉచిత ఆఫర్‌ను నిలిపివేయాల్సిందిగా ఇతర డీలర్లు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే అందరూ ఈ విధంగా ఎంతో కొంత సాయం చేయాలని వారికి చెప్పారని, వారి బెదిరింపులు తన సాయాన్ని అడ్డుకోలేవని వెల్లడించారు. రెండు రోజులపాటు, లక్ష రూపాయల విలువైన ఇంధనాన్ని అందించినట్టు మధుమోల్ వివరించారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశం తప్ప బిజినెస్ ప్రమోషన్ కోసం కాదని ఆయన స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆటో డ్రైవర్లు క్యూ కట్టారు. ఈ ఆఫర్‌పై వారంతా హర్షం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఇలాంటి ఆపర్ ఎపుడూ చూడలేదంటూ మురిసిపోయారు. Shocking ! Pressure from dealers' association to stop my charity work, their claim is it affects other pumps. My counter attack - let all pumps do small charities, you can't stop me. https://t.co/dNzLLqpixb — ABDULLA MADUMOOLE ಅಬ್ದುಲ್ಲ ಮಾದುಮೂಲೆ (@AMadumool) June 14, 2021 -
జియో ఫైబర్ : 30 రోజులు ఫ్రీ ట్రయల్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ప్రకటించింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి జియోఫైబర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నె లరోజులుపాటు ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది వీరితోపాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్ పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే 999, 1499 ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ) చందా ఉచితం. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త జియోఫైబర్ ప్రణాళికలు ప్రయోజనాలు అపరిమిత ఇంటర్నెట్ సిమెట్రిక్ స్పీడ్ (అప్లోడ్ వేగం = డౌన్లోడ్ వేగం) నెలకు 399 నుండి ప్రారంభమయ్యే ప్రణాళికలు అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 ఓటీటీ యాప్స్ ఉచితం జియోఫైబర్ నో-కండిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ 150 ఎంబీపీసెస్ అపరిమిత ఇంటర్నెట్ 4కే సెట్ టాప్ బాక్స్ ఉచిత వాయిస్ కాలింగ్ నచ్చకపోతే, (ఎలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవసంర లేకుండానే) ప్లాన్ వెనక్కి తీసుకోవచ్చు. జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ 399 రూపాయల ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ 699 రూపాయల ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ 999 రూపాయల ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ 1,499 రూపాయల ప్లాన్ లో300 ఎంబీపీఎస్ స్పీడ్ -
'జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమి లేదు'
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా కల్పిస్తూ జియో అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌పై టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ వల్ల ఇండస్ట్రి ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టీకరిస్తోంది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ నోట్‌ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థికసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రమోషనల్ ఆఫర్లపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. అయితే టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హాని ఉండదని ట్రాయ్ పేర్కొంది. టారిఫ్, టారిఫ్ ఆర్డర్ల బాధ్యతలన్నీ టెలికాం రెగ్యులేటరీ కిందకు వస్తాయి. సెక్టార్ ను ప్రమోట్ చేస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ట్రాయ్ బాధ్యతని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కన్జ్యూమర్ల ప్రయోజనాలను రక్షిస్తూ.. మార్కెట్‌ను డెవలప్ చేయాలనేది ట్రాయ్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీని కింద రిలయన్స్ జియోకు ఇచ్చిన అనుమతిని రెగ్యులేటరీ పూర్తిగా సమర్థించుకుంటోంది. దీనిపై అటార్ని జనరల్ అభిప్రాయాన్ని కూడా ట్రాయ్ కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రమోషనల్ ఆఫర్లు ఫైనాన్సియల్ సెక్టార్ కు తీవ్రంగా దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తంచేస్తూ టెలికాం సెక్రటరీ జే ఎస్ దీపక్ అధినేతగా ఉన్న టెలికాం కమిషన్ ట్రాయ్‌కి ఓ లేఖ రాసింది. రెండు ప్రమోషనల్ ఆఫర్లు వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. -
గడువు ముగిసినా జియోనే వాడతాం!
ఉచిత ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోకు, ఆ ఆఫర్ల గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులుంటారట. ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో డేటా సర్వీసులపై ఛార్జ్ చేసినా భరించేందుకే తాము సిద్ధమేనని అంటున్నారు. దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధమని పేర్కొంటున్నారు. బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే వారిలో 67 శాతం మంది జియోను రెండో సిమ్గానే వాడతారని తేలింది. అదేవిధంగా 18 శాతం మొదటి సిమ్గా దీన్ని ఉపయోగిస్తారని సర్వే పేర్కొంది. అయితే అత్యంత సంతృప్తికరమైన కస్టమర్లు 97.7 శాతం మంది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కే ఉన్నారని సర్వే తెలిపింది. కేవలం 17 శాతం భారతీ ఎయిర్టెల్ కస్టమర్లే జియోపై ఆసక్తి చూపుతున్నారని, అది కూడా క్వాలిటీ బాగుంటేనే దీన్ని మొదటిసిమ్గా వాడతామని చెబుతున్నట్టు తెలిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి అద్వానంగా ఉందని, జియోకు మరలిన ఈ కస్టమర్లు వాటిని సెకండరీ సిమ్గా వాడేందుకే మొగ్గుచూపుతున్నారని బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ సర్వే పేర్కొంది. ఆశ్కర్యకరంగా 26 శాతం యూజర్లు జియోను మొదటి సిమ్గానే వాడుతున్నారు. ఇన్నిరోజులు జియో నెట్ స్పీడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇతర టెల్కోలతో పోలిస్తే దీనికే 55 శాతం స్పీడ్ అధికమని తేలింది. జియో స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ, అస్థిరంగా ఉందని తేలింది. కేవలం 44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని అభిప్రాయ పడ్డారు. -
ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్
డెహ్రడూన్: రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉచిత ఆఫర్ ప్రకటించింది. శనివారం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లే మహిళలు సులువుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రావత్ చెప్పారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను గౌరవావించాలన్న స్ఫూర్తిని రాఖీ పండుగ కలగజేస్తుందని పేర్కొన్నారు.