ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ ఎయిర్‌ఫైబర్ గురించి 2022లో జరిగిన 45వ రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) లో దీనిపై ప్రకటన చేసింది. కానీ విడుదల, ధర ఇతర విషయాల్ని వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రెసిడెంట్ కిరణ్ థామస్ జియో ఫైబర్ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించే ఎయిర్ టెల్, బీఎస్‌ఎన్‌ఎల్,యాక్ట్ వంటి సంస్థలకు జియో గట్టిపోటీ ఇవ్వనుంది.
జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
జియో ఏం చెబుతోంది!
సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది.
Shri Akash M. Ambani introduces JioAirFiber, at the Reliance AGM 2022.#JioAirFiber #RILAGM #RILAGM2022 #JioTrue5G #WeCare #JioTogether #Jio #Jio5G #5G pic.twitter.com/tCmSatpUte
— Reliance Jio (@reliancejio) August 30, 2022
జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే?
జియో 2022 అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్‌టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment