
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే జులై 31న జియోబుక్ పేరుతో ల్యాప్ టాప్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. జియో తొలిసారి 2022 అక్టోబర్‌లో తొలి జియో బుక్ ల్యాప్ టాప్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ల్యాప్‌ట్యాప్ బరువు 990 గ్రాములు ఉండగా.. త్వరలో విడుదల చేయనున్న జియో బుక్ బరువు 1.2 కేజీలు ఉండడం గమనార్హం.
పలు నివేదికల ప్రకారం.. కొత్త జియో బుక్ ల్యాప్ టాప్ ఆక్టోబర్ ప్రాసెరస్‌తో పనిచేయనుంది. 4జీ కనెక్టివిటీతో బ్యాటరీ లైమ్ టైమ్ 24 గంటలు పనిచేయనుంది. జియోఓస్‌తో పనిచేసే ఈ బడ్జెట్ ల్యాప్ టాప్‌లో జియోమార్ట్, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్ ప్రీలోడ్‌తో రానున్నాయి.
ఇక కల్సర్ విషయానికొస్తే జియోబుక్ బ్లూ, గ్రే రెండు కలర్‌లలో లభ్యం కానుంది. దీని ధర రూ.20,000గా ఉంది. గత ఏడాది విడుదల చేసిన జియోబుక్ ఫస్ట్ జనరేషన్ ల్యాప్ టాప్ ధర రూ.15,777గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment