JioBook
-
అదిరే ఫీచర్లతో జియో కొత్త ల్యాప్ టాప్..ధర ఇంత తక్కువా!
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే జులై 31న జియోబుక్ పేరుతో ల్యాప్ టాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. జియో తొలిసారి 2022 అక్టోబర్‌లో తొలి జియో బుక్ ల్యాప్ టాప్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ల్యాప్‌ట్యాప్ బరువు 990 గ్రాములు ఉండగా.. త్వరలో విడుదల చేయనున్న జియో బుక్ బరువు 1.2 కేజీలు ఉండడం గమనార్హం. పలు నివేదికల ప్రకారం.. కొత్త జియో బుక్ ల్యాప్ టాప్ ఆక్టోబర్ ప్రాసెరస్తో పనిచేయనుంది. 4జీ కనెక్టివిటీతో బ్యాటరీ లైమ్ టైమ్ 24 గంటలు పనిచేయనుంది. జియోఓస్తో పనిచేసే ఈ బడ్జెట్ ల్యాప్ టాప్‌లో జియోమార్ట్, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్ ప్రీలోడ్‌తో రానున్నాయి. ఇక కల్సర్ విషయానికొస్తే జియోబుక్ బ్లూ, గ్రే రెండు కలర్లలో లభ్యం కానుంది. దీని ధర రూ.20,000గా ఉంది. గత ఏడాది విడుదల చేసిన జియోబుక్ ఫస్ట్ జనరేషన్ ల్యాప్ టాప్ ధర రూ.15,777గా ఉంది. -
జియోబుక్ ల్యాప్‌టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!
రిలయన్స్ జియో త్వరలో తన తొలి ల్యాప్‌టాప్‌ను దేశంలో లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఒక కొత్త నివేదిక ప్రకారం.. జియోబుక్ పేరుతో రాబోతున్న ఈ ల్యాప్‌టాప్‌కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10 ఓఎస్ సహాయంతో నడవనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ను ఎమ్'డోర్ డిజిటల్ టెక్నాలజీ అనే చైనీస్ కంపెనీ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. ఇది ఏఆర్ఎమ్ సహాయంతో పనిచేస్తుందని ఆ నివేదిక పేర్కొంది. అంటే జియో ల్యాప్ టాప్ సరసమైన ఆఫర్ కావచ్చు. టెలికామ్ ప్రొవైడర్ యొక్క జియోఫోన్ వ్యూహం ఏదైనా ఉంటే ఇది అర్ధవంతంగా ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్ లాగా, జియో ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఏఎమ్‌డీ లేదా ఇంటెల్ x86 ప్రాసెసర్లతో వస్తుందని సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌తో పాటు టాబ్లెట్, స్మార్ట్ టీవీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. (చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!)