Jio Airfiber
-
ఉచితంగా 'జియో ఎయిర్ ఫైబర్': ఇలా చేయండి
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో లేదా మైజియో స్టోర్‌లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుఅర్హత పొందిన కస్టమర్లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌కు సమానమైన 12 కూపన్లను పొందుతారు. ప్రతి కూపన్‌ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి. -
జియో టీవీ ప్లస్: ఒక కనెక్షన్‌తో రెండు టీవీలు
రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం 'జియో టీవీ ప్లస్ యాప్'ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ లాగిన్తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.జియో టీవీ ప్లస్ యాప్‌ను అనేది ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీలలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లోని కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి ఎస్టీబీ అవసరం లేదు. దీనికోసం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు & అదనపు కనెక్షన్లు అవసరం లేదు. ఇప్పటివరకు జియో ఎస్టీబీ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ ప్లస్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది.స్మార్ట్‌టీవీ ఓఎస్‌లో జియో టీవీ ప్లస్ యాప్ ఫీచర్స్సింగిల్ సైన్ ఇన్ (ఒకే సైన్ ఇన్): ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి.. మొత్తం జియో టీవీ ప్లస్ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.స్మార్ట్ టీవీ రిమోట్: స్మార్ట్ టీవీ రిమోట్‌ని ఉపయోగించి అన్ని జియో టీవీ ప్లస్ కంటెంట్, ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.స్మార్ట్ ఫిల్టర్: భాష, వర్గం లేదా ఛానెల్ నంబర్ ద్వారా ఛానెల్‌ని సెర్చ్ చేయవచ్చు.కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్: కావాల్సిన వేగంతో కంటెంట్‌ని చూడవచ్చు.క్యాచ్ అప్ టీవీ: గతంలో ప్రసారమైన షోలను చూడవచ్చు.పర్సనలైజ్డ్ రికమెండేషన్: వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఛానెల్‌లు, షోలు, సినిమాలను చూడవచ్చు.కిడ్స్ సేఫ్ సెక్షన్: పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం.డిజిటల్ టీవీ ఛానెల్స్జనరల్ ఎంటర్టైన్మెంట్: కలర్స్ టీవీ, ఈటీవీ, సోనీ షాబ్, స్టార్ ప్లస్, జీ టీవీన్యూస్: ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ7 భరతవర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18స్పోర్ట్స్: సోనీ టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్మ్యూజిక్: బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎంటీవీ, జూమ్కిడ్స్: పోగో, కార్టూన్ నెట్వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్బిజినెస్: జీ బిజినెస్, సీఎన్‌బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్‌బీసీ ఆవాజ్భక్తి: ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రాన్, సంస్కార్డౌన్లోడ్ & లాగిన్ చేసుకోవడం ఎలా?ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్ స్టోర్ల నుంచి జియో టీవీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీతో ద్రువీకరించుకోవాలి. -
Jio AirFiber: ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు జియో ఆఫర్లు..
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ అన్లిమిటెడ్ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. 1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు. జియో ప్రకారం.. దాని ఎయిర్ ఫైబర్ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తోంది. డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు మీ బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది. -
దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్ ఇంటర్నెట్ను ప్రారంభించిన జియో
న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్ఫైబర్ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్ఫైబర్తో ఇంకా కొన్ని ఇంటర్నెట్ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ(మీడియం ఎర్త్ ఆర్బిట్-ఎంఈఓ) కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది. జియోస్పేస్‌ఫైబర్ ఇప్పటికే గుజరాత్ గిర్, ఛత్తీస్‌గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. -
జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా జియో ఎయిర్‌ఫైబర్ సర్విసులను ఆవిష్కరించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. వైర్లెస్ విధానంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్విసులను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ధరలు స్పీడ్‌ను బట్టి రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి. వినాయక చవితి కల్లా వీటి సేవలను ప్రవేశపెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఇప్పటికే ఫైబర్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సర్విసులను అందిస్తోంది. ఇది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వైర్‌లైన్ మాధ్యమం ద్వారా ఇంటర్నెట్ను అందిస్తుండగా.. ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ తరహాలో నెట్‌ను పొందడానికి ఉపయోగపడుతుంది. ‘మా ఫైబర్–టు–ది–హోమ్–సర్వీస్ జియోఫైబర్ ఇప్పటికే 1 కోటి మిందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి నెల వేల కనెక్షన్లు కొత్తగా జతవుతున్నాయి. ఇంకా అసంఖ్యాక గృహాలు, చిన్న వ్యాపారాలకు వేగవంతమైన ఇంటర్నెట్ను అందించాల్సి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్ ఇందుకు తోడ్పడనుంది. విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌హోమ్ వంటి సొల్యూషన్స్‌తో ఇది కోట్ల గృహాలకు ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, స్మార్ట్‌హోమ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించగలదు‘ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియోకు 15 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల వైర్‌లైన్ వేయడంలో ప్రతిబంధకాల కారణంగా పూర్తి స్థాయిలో విస్తరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జియోఎయిర్‌ఫైబర్ ఆ సవాళ్లను అధిగమించి, యూజర్లకు ఇంటర్నెట్ను చేరువ చేయడానికి ఉపయోగపడనుంది. జియోఫైబర్ ప్లాన్లు, ఎటువంటి మార్పు లేకుండా స్పీడ్‌ను బట్టి రూ. 399 నుంచి రూ. 3,999 వరకు రేటుతో యథాప్రకారం కొనసాగుతాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ప్రత్యేకతలివీ.. ♦ ఎయిర్‌ఫైబర్ కేటగిరీలో అపరిమిత డేటాతో, స్పీడ్ 30 నుంచి 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. నెలవారీ ప్లాన్ల ధరలు రూ. 599 నుంచి రూ. 1,199 వరకు ఉంటాయి. ప్లాన్‌ను బట్టి 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లు, 14 పైచిలుకు యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ♦ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ కేటగిరీలో డేటా స్పీడ్ 300 నుంచి 1000 ఎంబీపీఎస్ వరకు (అపరిమితం) ఉంటుంది. ధర రూ. 1,499 నుంచి రూ. 3,999 వరకు ఉంటుంది. 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర 14 పైగా ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ♦ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఫై రూటర్, 4కే స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్ లభిస్తాయి. -
‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్.. పనితీరు, ధర ఎంతంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న వైర్లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభించనుంది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్‌బుల్ వైర్లెస్ ఇంట్నెట్ 1.5 జీబీపీఎస్ వేగంతో పనిచేస్తుంది. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. సెప్టెంబర్ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్‌ఫైబర్‌ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చు. వైఫై 6కి సపోర్ట్ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్లతో పోలిస్తే దీని స్పీడ్ ఎక్కువ. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం చాలా సులభమని జియో పేర్కొంది. దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో వైఫై హాట్ స్పాట్, 5జీతో అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. జియో ఎయిర్‌ఫైబర్‌తో ఇల్లు లేదా ఆఫీస్‌లో గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్కు త్వరగా కనెక్ట్ చేయడం సులభం’ అని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. జియో ఎయిర్‌ఫైబర్ వర్సెస్ జియో ఫైబర్ టెక్నాలజీ: జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ మాత్రం పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్లెస్ ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. తద్వారా ఫైబర్ కేబుల్స్ వల్ల తలెత్తే ఇబ్బందుల గట్టెక్కొచ్చు. స్పీడ్: జియో ఎయిర్‌ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది జియో ఫైబర్ 1జీబీపీఎస్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే, జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ స్థానికంగా ఉండే టవర్ల ఆధారంగా మారుతుందని గమనించాలి. కవరేజ్: జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ టెక్నాలజీ సాయంతో విస్తృతమైన కవరేజీని అందింస్తుంది. ఇన్స్టాలేషన్: జియో ఎయిర్‌ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించబడింది.యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ అవసరం. ధర: జియో ఎయిర్‌ఫైబర్ ధర దాదాపు రూ. 6,000. జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే ఖరీదైంది. ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ ఉంటుంది. చదవండి👉🏻 గూగుల్‌కు బిగ్ షాక్ -
Reliance AGM 2023: జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్‌ఫైబర్‌తో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
శుభవార్త..దేశంలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు..ఎలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఎయిర్‌ఫైబర్ గురించి 2022లో జరిగిన 45వ రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) లో దీనిపై ప్రకటన చేసింది. కానీ విడుదల, ధర ఇతర విషయాల్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రెసిడెంట్ కిరణ్ థామస్ జియో ఫైబర్ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్,యాక్ట్ వంటి సంస్థలకు జియో గట్టిపోటీ ఇవ్వనుంది. జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. జియో ఏం చెబుతోంది! సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. Shri Akash M. Ambani introduces JioAirFiber, at the Reliance AGM 2022.#JioAirFiber #RILAGM #RILAGM2022 #JioTrue5G #WeCare #JioTogether #Jio #Jio5G #5G pic.twitter.com/tCmSatpUte — Reliance Jio (@reliancejio) August 30, 2022 జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే? జియో 2022 అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.