రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం 'జియో టీవీ ప్లస్ యాప్'ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ లాగిన్‌తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.
జియో టీవీ ప్లస్ యాప్‌ను అనేది ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీలలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లోని కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి ఎస్‌టీబీ అవసరం లేదు. దీనికోసం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు & అదనపు కనెక్షన్లు అవసరం లేదు. ఇప్పటివరకు జియో ఎస్‌టీబీ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ ప్లస్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్‌టీవీ ఓఎస్‌లో జియో టీవీ ప్లస్ యాప్ ఫీచర్స్
సింగిల్ సైన్ ఇన్ (ఒకే సైన్ ఇన్): ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి.. మొత్తం జియో టీవీ ప్లస్ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
స్మార్ట్ టీవీ రిమోట్: స్మార్ట్ టీవీ రిమోట్‌ని ఉపయోగించి అన్ని జియో టీవీ ప్లస్ కంటెంట్, ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు.
స్మార్ట్ ఫిల్టర్: భాష, వర్గం లేదా ఛానెల్ నంబర్ ద్వారా ఛానెల్‌ని సెర్చ్ చేయవచ్చు.
కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్: కావాల్సిన వేగంతో కంటెంట్‌ని చూడవచ్చు.
క్యాచ్ అప్ టీవీ: గతంలో ప్రసారమైన షోలను చూడవచ్చు.
పర్సనలైజ్డ్ రికమెండేషన్: వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఛానెల్‌లు, షోలు, సినిమాలను చూడవచ్చు.
కిడ్స్ సేఫ్ సెక్షన్: పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం.
డిజిటల్ టీవీ ఛానెల్స్
జనరల్ ఎంటర్టైన్‌మెంట్: కలర్స్ టీవీ, ఈటీవీ, సోనీ షాబ్, స్టార్ ప్లస్, జీ టీవీ
న్యూస్: ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ7 భరతవర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18
స్పోర్ట్స్: సోనీ టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్
మ్యూజిక్: బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎంటీవీ, జూమ్
కిడ్స్: పోగో, కార్టూన్ నెట్‌వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్
బిజినెస్: జీ బిజినెస్, సీఎన్‌బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్‌బీసీ ఆవాజ్
భక్తి: ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రాన్, సంస్కార్
డౌన్‌లోడ్ & లాగిన్ చేసుకోవడం ఎలా?
ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్ స్టోర్‌ల నుంచి జియో టీవీ ప్లస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ చేసిన తరువాత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీతో ద్రువీకరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment