జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ భారీతగ్గింపు
జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ భారీతగ్గింపు
Published Fri, Jun 9 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ఫైబర్ సేవలతో బ్రాడు బ్యాండు మార్కెట్లోనూ తన మార్కు చూపించడానికి వచ్చేస్తోంది. దీపావళికి జియో ఫైబర్ సేవలు కమర్షియల్ గా లాంచ్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ముందుగానే సిద్ధమవుతోంది. అవసరమైతే హోం బ్రాడ్ బ్యాండు టారిఫ్ రేట్లను భారీగా తగ్గించనున్నామని పేర్కొంది. తమ ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండు ప్లాన్స్ ను మరోసారి పునరుద్ధరించనున్నామని, అవసరమైతే జియోకు తగ్గ టారిఫ్ ప్లాన్స్ ను ప్రకటించనున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రాడ్ బ్యాండు మార్కెట్లో దాదాపు కోటి సబ్ స్క్రైబర్లతో బీఎస్ఎన్ఎల్ ఆధిపత్య స్థానంలో ఉంది. దీని తర్వాత ఎయిర్ టెల్ కు 1.95 మిలియన్ మంది యూజర్లున్నారు. తమకు అతిపెద్ద ఆప్టిక్ ఫైబర్ ఆధారిత నెట్ వర్క్ ఉందని శ్రీవాస్తవ చెప్పారు. సర్వీసు క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా తమ సబ్ స్క్రైబర్ బేస్ ను పెంచుకుంటున్నామని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండు యూజర్లకు టారిఫ్ ప్లాన్స్ రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. రూ.799 రీఛార్జ్ కు సెకనుకు 4మెగాబిట్స్ తో 10జీబీ డేటాను ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైఎండ్ అపరిమిత ఎఫ్టీటీహెచ్ ప్లాన్ కింద రూ.2,641 రీఛార్జ్ తో 175జీబీ డేటాను 8ఎంబీపీఎస్ స్పీడులో అందిస్తోంది. కాగ, అతి త్వరలో జియో ఫైబర్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది. ఆ తర్వాత నెలకు రూ.500తో 100జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జియో ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్ టెల్ ఇటీవలే 1000జీబీ ఆఫర్ ను లాంచ్ చేసింది. అయితే ఇది కేవలం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమే. ఎంపిక చేసిన ప్లాన్స్ లో బ్రాడ్ బ్యాండు సర్వీసులు పొందే వారికి మాత్రమే ఆ ఆఫర్ ను అందిస్తోంది.
Advertisement
Advertisement