పండగలకో పబ్బాలకో బోనస్ ఇచ్చే యజమానులను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేసే యజమానులు చూసుంటారు. కానీ అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్తగా కీర్తించబడుతున్న అంబానీ ఈ విషయంలో కూడా 'అంతకు మించి' అనే చెప్పాలి. తన ఉద్యోగికి ఏకంగా రూ. 1,500 కోట్లు ఖరీదు చేసే ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 'రైట్ హ్యాండ్'గా పిలువబడే 'మనోజ్ మోదీ'కి ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు.
(ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!)
మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అంతే కాకుండా ఈయన ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ ఇంబానీ మరియు ఇషా అంబానీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోదీ హస్తం ఉంది. మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment