right hand
-
దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే!
ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరటానికి లేదా జీవితంలో సక్సెస్ సాధించడానికి అతిని కృషి మాత్రమే కాకుండా.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు స్నేహితులు కావొచ్చు లేదా ఉద్యోగులు కావొచ్చు. ఇది సాధారణ వ్యక్తుల కంటే దిగ్గజ వ్యాపార వేత్తల విషయంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కథనంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల విజయం వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులు (రైట్ హ్యాండ్స్) గురించి తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ & మనోజ్ మోదీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా.. భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఈ రోజు ఇంత సక్సెస్ సాధించాడంటే దాని వెనుక ఎంతోమంది సన్నిహితుల కృషి కూడా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోదీ'. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. ఆ తరువాత కంపెనీ ఉన్నతికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు. మనోజ్ మోదీ అంకిత భావానికి మెచ్చిన ముఖేష్ అంబానీ అతనికి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర రూ. 1,500 కోట్ల కంటే ఎక్కువే. ఇషా అంబానీ & భక్తి మోదీ ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ కూడా వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తోంది. ఈమె ఉన్నతికి కారణమైన కొంతమంది వ్యక్తులలో ఒకరు భక్తి మోదీ. ఈమె మనోజ్ మోదీ కుమార్తె. మనోజ్ మోదీ కుమార్తె భక్తి మోదీ.. ఇషా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌లో కీలక కార్యనిర్వాహకురాలుగా పనిచేస్తోంది. కంపెనీ ఈ రోజు వేలకోట్లు సంపాదిస్తోంది అంటే దాని వెనుక భక్తి మోదీ పాత్ర కూడా ప్రధానమనే చెప్పాలి. ఈమెను ఇషా అంబానీ రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. ఇషా అంబానీ కంపెనీ ప్రధాన వ్యవహారాలను చూస్తున్న వారిలో భక్తి మోదీ కాకుండా.. 'దర్శన్ మెహతా' కూడా ఉన్నారు. ఈయన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రతన్ టాటా & శంతను నాయుడు రతన్ టాటా గురించి తెలిసిన చాలామందికి 'శంతను నాయుడు' గురించి కూడా తెలిసే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఏర్పడ్డ వీరి బంధం చాలా మందికి ఆదర్శం. శంతను నాయుడు.. రతన్ టాటా వ్యక్తిగత సహాయకుడు. అంతే కాకుండా అతని కంపెనీలో జనరల్ మేనేజర్. 2018 నుంచి రతన్ టాటా కోసం పనిచేయడం ప్రారంభించిన శంతను నాయుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. శంతను నాయుడు.. రతన్ టాటాకు ఎంత సన్నిహితుడిఫైనప్పటికీ, వ్యాపార కార్యకలాపాల్లో తనదైన సలహాలు ఇస్తున్నప్పటికీ.. కంపెనీ ఉన్నతికి దోహపడిన వారితో చెప్పగోదగ్గ వ్యక్తి 'ఎన్ చంద్రశేఖరన్'. ఈయనే రతన్ టాటా రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. తమిళనాడుకి చెందిన చంద్రశేఖరన్.. కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్, తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో ఎంసీఏ పూర్తి చేసి 1987లో టీసీఎస్‌లో చేరాడు. ఆ తరువాత ఈయన 2009లో సీఈవో అయ్యారు. -
గిఫ్ట్ ఇవ్వడంలో అంబానీ స్టైలే వేరు - ఇదే నిదర్శనం
పండగలకో పబ్బాలకో బోనస్ ఇచ్చే యజమానులను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేసే యజమానులు చూసుంటారు. కానీ అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్తగా కీర్తించబడుతున్న అంబానీ ఈ విషయంలో కూడా 'అంతకు మించి' అనే చెప్పాలి. తన ఉద్యోగికి ఏకంగా రూ. 1,500 కోట్లు ఖరీదు చేసే ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 'రైట్ హ్యాండ్'గా పిలువబడే 'మనోజ్ మోదీ'కి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అంతే కాకుండా ఈయన ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ ఇంబానీ మరియు ఇషా అంబానీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోదీ హస్తం ఉంది. మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
ఎన్టీఆర్ చేతికి గాయం.. సర్జరీ.. వాస్తవం ఏంటంటే?
దీపావళి పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకులతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య ఎన్టీఆర్ సాంప్రదాయ దుస్తులతో కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోటోను కొంచెం పరీక్షించి చూస్తే ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ చేతికి ఫ్రాక్చర్ అయ్యిందా అంటూ ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడి వేలికి గాయం అయిందని, దీంతో ఎన్టీఆర్ సర్జరీ కూడా చేయించుకన్నట్లు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్ అయితే ఈ విషయం మీద ఆరా తీయగా.. ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం నిజమేనని తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వినికిడి. చదవండి: ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) ఇదిలా ఉండగా తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ, ఎవరు మీలో కోటిశ్వరుడు ప్రోగ్రాంతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు. -
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తన చేతికి సర్జరీ చేయించుకోవడంతో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని చిరంజీవి తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన అభిమానులతో చిరు ఆదివారం భేటీ అయ్యారు. కరోనా బారిన పడి ప్రజలు ఆక్సిజన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. దీంతో చిరు స్పందిస్తూ.. తన కుడి చేతి మణికట్టుకి చిన్న శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించడంతో వాళ్లు మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందన్నారని చెప్పారు. అందుకోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సి అవసరం లేదని 15 రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు తన అభిమానులకు తెలిపారు. చదవండి: Bigg Boss 5 Telugu: బొమ్మతో ఎలిమినేషన్, భయంతో ఏడుపందుకున్న షణ్ను -
ఒంటి చేత్తో ఆడేస్తున్నాడు...
చిత్తూరు, తిరుపతి రూరల్ : ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ప్రతిభ చాటుతున్నాడు. ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లో వేదాంతపురం జట్టు తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, ఓపెనింగ్ బౌలర్‌గా ఆడుతున్న మునిశేఖర్, గురువారం ఓటేరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు విభాగాల్లో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకున్నాడు. శభాష్ అనిపించుకున్నాడు. -
నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే
కుడి ఎడమైతే..పొరపాటు లేదోయ్.. జోగిపేట:చాలామంది కుడిచేత్తోనే పనిచేస్తారు. కానీ కొద్ది మందికి మాత్రం ఎడమ చేతి వాటం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వారు ఎడమ చేత్తో పనిచేయడం అలవాటు. లెఫ్ట్ హ్యాండర్స్ తమ పనులన్నింటినీ ఎడమచేత్తోనే చేసుకుంటారు. ఇటువంటి వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అలెగ్జాండర్ ది గ్రేట్, అడాల్ఫ్ హిట్లర్, మార్లిన్ మన్రో, చార్లీ చాప్లిన్, వాజ్పాయ్, సౌరభ్‌గంగూలీ, యువరాజ్‌సింగ్ వంటి వారున్నారు. తొలి లెఫ్ట్ హ్యాండర్స్ డే 1976 ఆగస్టు 13న జరిగింది. లెఫ్ట్హ్యాండర్స్ను సౌత్ పాస్ అని అంటారు. వాళ్లు మనకెన్నో జోకులు చెప్తారు. వివిధ సందర్భాల్లో తమ మీద తాము లేదా వారి మీద ఇతరులు పేల్చిన చతురోక్తులు చెప్తారు. ఎదురయ్యే ఇబ్బందులు... సాధారణంగా రైట్హ్యాండర్స్ను దృష్టిలో పెట్టుకొని అన్ని వస్తువులు రూపుదిద్దుకుంటాయి. స్కూల్లో లైఫ్ట్ హ్యాండర్స్ కోసం ఏర్పాటైన డెస్కులు ఎప్పుడైనా చూశారా. ఇక అరుదుగా లభించే ఎడమచేతివాటంగా ఉండే వస్తువులు ఏవైనా చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కాఫీ మగ్గులపై కుడిచేత్తో పట్టుకుంటేనే కనిపించేలా బొమ్మ లేదా అక్షరాలు ఉంటాయి. కత్తెరలు కుడిచేత్తో పట్టుకుంటే నే అనువుగా ఉంటాయి. కంప్యూటర్ మౌస్ కూడా అంతే.. కుడిచేత్తో పనిచేసేందుకు వీలుగా రూపొందింది. ఇలా దాదాపు అన్ని వస్తువులు రైట్హ్యాండర్ను దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దుకున్నవే. బిడ్డ ఏ చేతి వాటంతో ఉంటే ఆ చేయి నోటికి దగ్గరగా పెట్టుకుంటుందని పలు పరిశోధనల్లో గుర్తించారు. ఇక ఎడమచేతివాటం ఏర్పడడానికి ఎల్ఆర్ఆర్ఎం-1 అనే జన్యువు కూడా కారణమవుతోందని మరో పరిశోధనలో వెల్లడైంది. చిన్నప్పటి నుంచే అలవాటైంది చిన్నప్పటి నుంచి ఎడమచేతితోనే రాయడం అలవాటైంది. కుడి చేతితో రాసేందుకు ప్రయత్నించినా రావడంలేదు. బోజనం మాత్రం కుడిచేతితోనే చేస్తాను. మొదట్లో తనను ఎడమచేతిని వినియోగించడంపై స్నేహితులు గేలి చేసేవారు. తర్వాత అలా అనడం మానేశారు. దినచర్యలో ఎక్కువగా ఎడమచేతికే ఎక్కువగా పనిచెబుతాను. మా ఇంట్లో ఎవ్వరికీ ఎడమ చేతి వాటం లేకున్నా నాకు రావడంపై మా ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం తాను జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. - ఆకుల చండిక, విద్యార్థిని, జోగిపేట ఎడమచేతే అచ్చొచ్చింది తనకు ఎడమచేతే అచ్చొచ్చింది. తన జీవితం అన్ని విధాలు సాఫీగా సాగడానికి అదేకారణమని తాను భావిస్తున్నాను. బీహెచ్ఇఎల్ ఉద్యోగి తనకు జీవితభాగస్వామిగా లభించారు. తనకు తెలియకుండానే ఎక్కువగా ఎడమచేతిని వినియోగించడం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి గృహిణిగా ఉంటున్నాను. చదువుకునే సమయంలో ఎడమచేతి విషయమై ఎవ్వరూ పట్టించుకోరు. కాని ఏదైనా ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎడమచేతిని వినియోగిస్తే వింతగా చూస్తుంటారు. తన పెద్ద కుమారుడు ఆకాష్ కూడా ఎడమచేతి వాటం రావడం ఆశ్చర్యం కల్గించింది. ఎవరో ఏమంటున్నారో పట్టించుకోవద్దు మన పని మనం చేసుకోవాలి. - సంగీత, గృహిణి -
ఒంటిచెయ్యి
కథ తెల్లారి నిద్రలేవగానే దువా చదువుకుని, అరచేతుల్ని ముఖానికి రుద్దుకోవటం అలవాటు నాకు. ఇవాళ చూస్తే నా కుడి చెయ్యి లేదు. చల్లగా చలనం లేకుండా మంచమ్మీదే ఒకపక్కగా పడిపోయి ఉంది. ఎలా తెగిపోయిందో అర్థం కావడం లేదు. కనీసం ఒక నెత్తుటి చుక్క కూడా కారలేదు. ఏదో వేపమొద్దును తెచ్చి రంపంతో కోస్తే ఎంత నున్నగా కట్ అవుతుందో అలా కట్ అయిపోయింది. ‘‘ఒసేయ్! నా చెయ్యి తెగిపోయిందే’’ బిగ్గరగా అరిచాను దడుసుకుని. మా ఆవిడ బెడ్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘ఓస్ అంతేనా. ఇంకేదో అనుకుని భయపడి చచ్చాను. పోతే పోయిందిలెండి పాడు చెయ్యి. తీసుకెళ్లి అల్మారాలో పెట్టండి. వీలు చూసుకుని డాక్టరు దగ్గరకెళ్లి కుట్టించుకోవచ్చు. ఇంతమాత్రం దానికే అంత కంగారైతే ఎలాగండి’’ -వచ్చినంత వేగంగానే చెప్పి వెళ్లిపోతోందావిడ. అప్పుడు చూశాను. ఒళ్లు జలదరించింది. మా ఆవిడకు ఎడమ చెయ్యి లేదు. అవును ఆమెది ఎడమ చెయ్యి వాటం. అన్నం వడ్డించాలన్నా, గ్లాసు పట్టుకుని నీళ్లు తాగాలన్నా, పుస్తకంలో ఏదైనా రాయాలన్నా, ఇంట్లో కసువు ఊడ్చాలన్నా, చివరికి ఏడేళ్ల పిల్లోడు ‘చాందూ’ని దండించాలన్నా ప్రతిదానికీ ఆమె ఎడమ చేతినే వాడుతుంది. ఇప్పుడా చెయ్యే లేదు. ‘‘నా చెయ్యి సరే. ఆమె చెయ్యి ఎప్పుడు పోయిందీ?’’ నాకేమర్థం కావడం లేదు. మళ్లీ అరిచి ఆమెనే అడుగుదామనుకున్నాను. కానీ ఆగిపోయాను. నాకసలే మతిమరుపు అంటుంటుంది మా ఆవిడ. మరోసారి ఆమెతో ఆ మాట అనిపించుకోవడం తప్పితే, నాకు సమాధానం దొరకదని అర్థమైంది. ఒంటిచేత్తోనే దువా చేసుకుని ఆ అరచేతినే ముఖానికి రుద్దుకుని మంచం దిగాను. నా కుడి చేతిని తీసుకెళ్లి జాగ్రత్తగా అల్మారాలో మా ఆవిడ ఎడమ చేతి పక్కనే పెట్టాను. ఒంటిచేత్తోనే గబగబా బ్రెష్ చేసుకుని, స్నానం కానిచ్చి, టక్ చేసుకుని, టిఫిన్ తిని, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని ఆఫీస్‌కని బయల్దేరి ఇంట్లోంచి బయటికొచ్చాను. మా ఇంటి ఓనరు ఎదురయ్యాడు... రెండు చేతులూ లేకుండా. ‘థూ... దీనెమ్మా... ఏదో అయ్యిందిరాబై... ఇవ్వాళ...’ అనుకున్నాను. ‘‘అంకుల్. మీ రెండు చేతులూ...’’ అని డౌట్ అడుగుదామనుకున్నాను. కానీ అతను నా కుడి చెయ్యి గురించి అడిగితే అప్పుడేం చెప్పాలి సమాధానం. అందుకే నోరు మెదపకుండా నవ్వుతూనే ఆఫీస్కెళ్తున్నానని సైగ చేసి వచ్చి టూ వీలర్ ఎక్కాను. విచిత్రం... ఒంటిచేత్తోనే బండిని చక్కగా తోలుతున్నాను. కాదు నేను తోలడం ఏంటి... బండే ఒంటిచేతిగాళ్ల కోసం తయారుచేయబడి ఉంది. ఆ విషయం నేను తొందర్లో గమనించలేదు. వీధిలో అందరూ ఒంటిచేత్తోనే బళ్లు తోలుతున్నారు. ఏమంటే కొందరు కుడిచేత్తో, మరికొందరు ఎడమచేత్తో. అంతే తేడా. అసలు రాత్రికి రాత్రి లోకం ఎలా అవిటిదైపోయిందా అనేది నా పెద్ద డౌటు. నేను ఆఫీసుకెళ్లే దారిలో పెద్ద హాస్పిటల్ ఉంది. అది నేనున్న ఈ మహానగరంలోనే చాలా ఫేమస్. ఆ ఆస్పత్రి ముందు మనుషులంతా తెగిపోయిన తమ చేతుల్ని పట్టుకుని క్యూలో నిల్చుని ఉన్నారు. ‘నో పార్కింగ్’ అని తెలిసినా కూడా ఎలాగోలాగ ధైర్యం చేసి, బండిని సైడ్ తీసుకుని ఆపి, అక్కడివారిని విచారిస్తే దిమ్మతిరిగిపోయింది నాకు. వీళ్లంతా ఎప్పుడో ఏడాది కిందట చేతులు తెగిపోయినవాళ్లనీ, అప్పుడు దరఖాస్తు చేసుకుంటే, ఇవ్వాళ్టికి ఆస్పత్రివాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చారనీ, అందుకే అందరూ క్యూలో నిల్చున్నారనీ దాని సారాంశం. అమ్మా... దానెమ్మ బడవా... ఇప్పుడెట్టా. ఈ చేతిని అతికించుకోవాలంటే ఏడాది వెయిట్ చేయాల్నా? ఇంతమందికి ఈ దేశంలో చేతుల్లేవా? ఇంకా నేనేదో రాత్రికి రాత్రే జరిగిన మిరాకిల్ అనుకుంటున్నా. ఆ ఏడాదిలోపు ఒంటిచేత్తో ఎలా బతకాలో అందరికీ అలవాటైపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా రెండు చేతుల్తో బతకడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ఒంటిచేతి జీవితానికే అలవాటుపడి ఉన్నారు. కానీ ఎన్ని రోజులైనా నేనలా కాకూడదు. ఎట్టి పరిస్థితిలో ఆస్పత్రికెళ్లి వీలైనంత త్వరగా చేతిని అతికించుకోవాలి. అంటే ఇప్పుడే వెళ్లి ఆపరేషన్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. బండిని నో పార్కింగ్‌లోనే వదిలేసి, హడావిడిగా దరఖాస్తు కౌంటర్ దగ్గరికెళ్లాను. అక్కడ తిరుపతి దేవుని దగ్గర కన్నా పెద్ద క్యూ ఉంది. తిరుపతిలో ఇప్పుడు నాలుగైదు క్యూలైన్లు పెట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇక్కడ ఆ మాత్రం ప్లాన్ కూడా ఉన్నట్టు లేదు. భయపడిపోయాను. ఈ క్యూలో నిలబడితే ఏ వారానికో కానీ బయటపడలేను. ఇక్కడే స్నానాలు, అన్నాలు, నీళ్లు అన్నీ కానిచ్చేస్తున్నారంతా. ఇదే అదనుగా చోటా మోటా వ్యాపారులంతా చెలరేగిపోతున్నారు. క్యూ వెంబడి రకరకాల వస్తువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఏదో ఒకటి కొనమని డిమాండ్ చేస్తున్నారు. కొననివాళ్లను బూతులు తిడుతున్నారు. బలవంతంగా వస్తువులు చేతిలో పెట్టి జేబులు తడిమి మరీ డబ్బులు తీసుకుంటున్నారు. మరీ భీష్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా క్యూలోంచి బయటికి లాగేస్తున్నారు. ‘‘ఇంట్లోంచి బయటికొచ్చాక ఏదో ఒకటి కొనకుండా ఎలా ఉంటారండీ. అలాంటివాళ్లు అసలు ఇంట్లోంచి బయటికి ఎందుకొచ్చారండీ’’ అని ఇంతింత పెద్ద గొంతులేసుకుని అరుస్తున్నారు. ఇప్పుడు చెయ్యేలేదు. ఇంకాసేపు అక్కడుంటే ఏమి లేకుండా పోతుందో చెప్పలేను. అసలే ఆఫీస్‌కు టైం అవుతోంది. ఇక్కడ నిలబడి కుస్తీ పట్టాలంటే జేబు నిండా డబ్బు, ఒంటినిండా సత్తువతో పాటు వారం రోజుల లీవు కావాలి. వెంటనే వెనక్కి వచ్చేసి బండి స్టార్ట్ చేసుకుని నేరుగా ఆఫీస్కొచ్చాను. ఒంటిచేత్తోనే సలాం చేశాడు గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు. వంగి వాడి సలాంను రిసీవ్ చేసుకుని నేరుగా బండిని పార్కింగ్‌లో పెట్టి లిఫ్ట్ పట్టుకుని ఫ్లోర్లోకెళ్లాను. అందరూ ఒంటి చేత్తో కంప్యూటర్ని టపటపలాడిస్తున్నారు. నేనలా చేయగలనా? గబగబా లంచ్ బాక్స్ పక్కనపెట్టి, నా సీట్లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేశాను. విచిత్రం... ఒంటిచేత్తో పనిచేయడం నాకు పెద్ద కష్టమనిపించడం లేదు. అదేదో అలవాటున్న పనిలాగే నా ఒంటిచెయ్యి చేసుకుపోతోంది. ఏకకాలంలో మౌస్‌ని, కీబోర్డ్‌ని దడదడలాడించేస్తోంది. అంతా సంతోషమే కానీ, ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు చేయి లేని సంగతిని పట్టించుకుంటున్నట్టు లేడు. అది నాకు కొంత బాధగా అనిపించింది. పక్కనే ఉన్న కొలీగ్‌ను అడిగాను. ‘‘నిన్నటిదాక మీ అందరికీ చేతులున్నాయి కదా. ఇవ్వాళే ఎందుకు లేవు?’’ అని. అతను నవ్వాడు. ‘‘ఒరేయ్ పిచ్చోడా! మాకు చేతుల్లేక చాలా రోజులైంది. నీకే చేతులున్నాయి కాబట్టి, ఇన్నాళ్లూ ఆ సంగతి తెలియలేదు’’ అన్నాడతను. అవును. ఇదే లోకం తీరు. ఏదైనా మనకు లేకుంటేనే ఎదుటివాళ్లకు ఏముందో తెలిసేది. అన్నీ మనకుంటే మనం ఇంకెవ్వర్నీ పట్టించుకోం. కొలీగే కదా అని లైట్ తీసుకున్నాను ఇన్నాళ్లు. ఒక్కమాటలో ఎంత ఫిలాసఫీ చెప్పేశాడు వీడు. అయినా వీళ్లతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే. ఇన్నాళ్లయినా చేతులు కాపాడుకోగలిగాను. కొంచెం గర్వంగా అనిపించింది. లీవు సంగతి గుర్తుకొచ్చి బాస్ గదికెళ్లాను. అతను కాళ్లతో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. రెండు చేతులు ఎప్పుడు తెగిపోయాయో - లేవు. అతణ్ని పట్టుకుని ఈ కారణంతో లీవ్ అడగటం సబబా అనిపించింది - ఒక్క క్షణం నాకు. అయినా తప్పదనుకుని అడిగేశాను. ‘‘సా...ర్ చెయ్యి అతికించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. వారం రోజులు లీవ్ కావాలి.’’ అతను నన్ను పిచ్చోడి కన్నా దారుణంగా చూశాడు. ‘‘ఆ తీరికే ఉంటే నేను నా రెండు చేతులు ఎప్పుడో అతికించుకునేవాణ్ని. ఆ తీరికే లేక కనీసం అప్లికేషన్ కూడా ఇంతవరకు పెట్టలేకపోయాను. రోజుల తరబడి లీవులు పెట్టి అందరూ చేతులు అతికించుకోవడం కోసం వెళ్తే, నేను ఆఫీసు మూసుకోవాల్సిందే. అయినా ఇప్పుడు ఆ వెధవ చెయ్యి ఉండి ఏం ఉద్ధరించాలంటా. మూసుకుని మొండిగా పనిచెయ్యడం నేర్చుకో’’ అన్నాడతను. నిజమే. ఇదే కార్పొరేట్ కల్చర్. ఒక్కోసారి ఒక్కో అవయవం శరీరం నుంచి తెగిపడుతున్నా నాది కాదులే అనుకుని ఉద్యోగులు పనిచేస్తుండాలి. నాకు చేయి లేదు కాబట్టి అందరూ చేతులు లేనివాళ్లే కనిపిస్తున్నారు. ఒకవేళ నాకు తల లేకపోయుంటే ఎంతమందికి తలల్లేవో తెలిసిపోయేది. బాస్ ఛీదరింపుతో వచ్చి సీట్లో పడ్డాను. టైం చూసుకుంటే అప్పుడే ఒంటి గంటైపోతోంది. ఆకలి చంపేస్తోంది. ఈ ఆకలిక్కూడా ఒక కాలు, ఒక చెయ్యి లేకుంటే బావుండేది. అప్పుడు తిండి బాధ కొంతైనా తగ్గేది. భోజనం బాక్సు పట్టుకుని లిఫ్టులోనే దిగి క్యాంటీన్కెళ్లాను. ఓ కార్నర్లో ఉన్న టేబుల్‌ను చూసుకుని కూర్చున్నాను. బాక్స్ ఓపెన్ చేయబోయేంతలో వచ్చింది స్వీట్ బాక్స్ పట్టుకుని హెచ్.ఆర్. డిపార్టుమెంట్లో పనిచేసే నా ఫ్రెండ్ సరయు. రావడం రావడంతోనే ‘గుడ్ న్యూస్’ అంటూ పెద్దగా అరుస్తూ లడ్డూ తీసి నా నోట్లో దూర్చింది. సగం లడ్డు లోపలికెళ్లిపోగా మిగతాది కిందపడిపోకుండా పట్టుకుని ‘ఏంటి సంగతి’ అన్నాను నముల్తూనే. ‘‘రాత్రి... నా బేబి, నా ముద్దుల పట్టీ, నా బంగారు తల్లి... నన్ను మనస్ఫూర్తిగా క్షమించేసిందోచ్’’ అంది. ‘‘అవునా? మనస్ఫూర్తిగానా? అసలు పాప మనస్ఫూర్తిగా క్షమించిందన్న సంగతి అంత కచ్చితంగా నీకెలా తెలిసింది?’’ అన్నాను. ఆమె స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి, తన రెండు చేతులూ చూపించింది ఒకేసారి ‘‘టట్టడోయ్’’ అంటూ. ఎంత బావున్నాయో. ఉదయం నుంచి చేతుల్లేనివాళ్లను చూసి జీవితం బోరు కొట్టేసింది. ఆ చేతులు అతికించుకున్నవేమో అని అనుమానంగా చూశాను. కాదు అత్యంత సహజంగా ఉన్నాయి. హంస రెక్కల్లా ఉన్నాయి. మనసుకు ఆనందంగా అనిపించింది. ఆవిడ మళ్లీ స్వీటు బాక్సు చేతుల్లోకి తీసుకుని ఇంకెవరికో ఇవ్వడానికి వెళ్లిపోయింది. నాకు సడన్‌గా, ఆ రాత్రి నా చెయ్యి ఎందుకు పోయిందో స్ఫురించింది. దుఃఖం ఆపుకోలేక బడబడా ఏడ్చేశాను. ‘‘ఒరే.. చాందూ! నీ మీద చెయ్యెత్తిన నాకు... క్షమాపణ ఉందా..?’’