ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరటానికి లేదా జీవితంలో సక్సెస్ సాధించడానికి అతిని కృషి మాత్రమే కాకుండా.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు స్నేహితులు కావొచ్చు లేదా ఉద్యోగులు కావొచ్చు. ఇది సాధారణ వ్యక్తుల కంటే దిగ్గజ వ్యాపార వేత్తల విషయంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కథనంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల విజయం వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులు (రైట్ హ్యాండ్స్) గురించి తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ & మనోజ్ మోదీ
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా.. భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఈ రోజు ఇంత సక్సెస్ సాధించాడంటే దాని వెనుక ఎంతోమంది సన్నిహితుల కృషి కూడా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోదీ'.
నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. ఆ తరువాత కంపెనీ ఉన్నతికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు.
మనోజ్ మోదీ అంకిత భావానికి మెచ్చిన ముఖేష్ అంబానీ అతనికి ముంబైలోని నేపియన్ సీ రోడ్‌లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర రూ. 1,500 కోట్ల కంటే ఎక్కువే.
ఇషా అంబానీ & భక్తి మోదీ
ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ కూడా వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తోంది. ఈమె ఉన్నతికి కారణమైన కొంతమంది వ్యక్తులలో ఒకరు భక్తి మోదీ. ఈమె మనోజ్ మోదీ కుమార్తె.
మనోజ్ మోదీ కుమార్తె భక్తి మోదీ.. ఇషా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌లో కీలక కార్యనిర్వాహకురాలుగా పనిచేస్తోంది. కంపెనీ ఈ రోజు వేలకోట్లు సంపాదిస్తోంది అంటే దాని వెనుక భక్తి మోదీ పాత్ర కూడా ప్రధానమనే చెప్పాలి. ఈమెను ఇషా అంబానీ రైట్ హ్యాండ్ అని పిలుస్తారు.
ఇషా అంబానీ కంపెనీ ప్రధాన వ్యవహారాలను చూస్తున్న వారిలో భక్తి మోదీ కాకుండా.. 'దర్శన్ మెహతా' కూడా ఉన్నారు. ఈయన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రతన్ టాటా & శంతను నాయుడు
రతన్ టాటా గురించి తెలిసిన చాలామందికి 'శంతను నాయుడు' గురించి కూడా తెలిసే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఏర్పడ్డ వీరి బంధం చాలా మందికి ఆదర్శం. శంతను నాయుడు.. రతన్ టాటా వ్యక్తిగత సహాయకుడు. అంతే కాకుండా అతని కంపెనీలో జనరల్ మేనేజర్. 2018 నుంచి రతన్ టాటా కోసం పనిచేయడం ప్రారంభించిన శంతను నాయుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..
శంతను నాయుడు.. రతన్ టాటాకు ఎంత సన్నిహితుడిఫైనప్పటికీ, వ్యాపార కార్యకలాపాల్లో తనదైన సలహాలు ఇస్తున్నప్పటికీ.. కంపెనీ ఉన్నతికి దోహపడిన వారితో చెప్పగోదగ్గ వ్యక్తి 'ఎన్ చంద్రశేఖరన్'. ఈయనే రతన్ టాటా రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. తమిళనాడుకి చెందిన చంద్రశేఖరన్.. కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్, తిరుచిరాపల్లిలోని ఎన్‌ఐటీలో ఎంసీఏ పూర్తి చేసి 1987లో టీసీఎస్‌లో చేరాడు. ఆ తరువాత ఈయన 2009లో సీఈవో అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment