
చిత్తూరు, తిరుపతి రూరల్ : ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్‌లో ఉత్తమంగా రాణిస్తున్నాడు.
బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ప్రతిభ చాటుతున్నాడు. ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్‌లో వేదాంతపురం జట్టు తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, ఓపెనింగ్ బౌలర్‌గా ఆడుతున్న మునిశేఖర్, గురువారం ఓటేరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు విభాగాల్లో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకున్నాడు. శభాష్ అనిపించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment