ysr cricket tourney
-
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు స్టేడియంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నీలో 490 జట్లు పాల్గొంటున్నాయి. 15 మైదానాల్లో వచ్చే ఏడాది జనవరి 9 వరకూ మ్యాచ్‌లు జరగనున్నాయి. విజేతకు రూ.10 లక్షలు, రన్నరప్‌కు రూ.5 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ఏసీఏ ప్రెసిడెంట్ శరత్‌చంద్రారెడ్డిని కోరుతామన్నారు. ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్‌ను కూడా విశాఖకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగానే కాకుండా క్రీడా రాజధానిగా కూడా మారనుందని వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉంది
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ అనే పేరులో వైబ్రేషన్ ఉందని, ఆయన పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించటం సంతోషంగా ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ పోటీలు చరిత్రలో నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ విజయసాయిరెడ్డి కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఇంట్లో మనిషి జన్మదినంగా చేసుకున్నారన్నారు. ఈ పోటీలు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కోసం పెట్టలేదని, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బైటకు తీయడం కోసం పెట్టారని స్పష్టం చేశారు. ( వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్ రికార్డు) క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది : మంత్రి అవంతి ‘‘ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు పెడుతున్నాము. క్రికెట్ పోటీల వలన యువతలో ఉన్న నైపుణ్యం బైట పడుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. -
నగరిలో ముగిసిన క్రీడాసంబరం
నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నమెంటు శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో నిర్వహిం చిన ఈ పోటీల్లో 220 టీములు పాల్గొన్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన పోటీల్లో 2400 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు రోజూ ఇందులో పాల్గొని క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. విజయపురం(నగరి): నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో 8రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నీ శుక్రవారం ముగిసింది. 8 రోజులపాటు 220 జట్లు,2400 మంది క్రీడాకారులతో నగరి ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో సంబరంలా సాగిన టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్స్‌లో నగరి డేంజర్ ఎలెవన్ ఏ జట్టు విజేతగా నిలిచింది. పుత్తూరు ఎంజీ ఫైర్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలకు ము ఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రోజా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధన కోసం, జగనన్న ఆశయాల కోసం పోరాడుతూ మహానేత పేరుతో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన ఎమ్మెల్యే రోజా అభినందనీయురాలని కొనియాడారు. టోర్నీ నిర్వహించడం ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన పని అని అన్నారు. ఎమ్మెల్యే రోజా విజన్ ఉన్న నాయకురాలు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మా ట్లాడుతూ గ్రామీణ యువతకోసం ఎమ్మెల్యే రోజా ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి అవకా శాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. గ్రామీ ణ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది ఒక వేదికగా నిలిచిందని తెలిపారు. అందరి ఆశీస్సులతోనే తనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రొత్సహిస్తున్న పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నగరి ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసంతోనే ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించగలిగానని తెలిపా రు. మొదట్లో 100 జట్లు అనుకుంటే 220 జట్లు వచ్చాయని పేర్కొన్నారు. టోర్నీ నిర్వహణకు సహాయ, సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగరి డిగ్రీ, జూని యర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఆమె వెంటబడి పోలీసులు కేసులు పెడుతున్నారు
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా ఉపయోగించుకుని వైఎస్సార్ సీపీ నాయకులను అణిచి వేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ క్రికేట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని, నిలదీస్తోందనే ఉద్దేశంతో కుట్రచేసి ఒక సంవత్సరం పాటు శాసనసభకు రాకుండా సస్పెండ్ చేశారని తెలిపారు. రోజా వెంట పోలీసులుపడి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక మహిళకు ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రశ్నించారు. గ్రామ దర్శిని పేరిట ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ప్రజలతో బహిరంగ సభలు పెడుతున్నారని, అందులో గ్రామాలకు అవసరమైన అభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న పాదయాత్ర గురించి కించపరుస్తూ మాట్లాడటం చౌకబారు తనమన్నారు. చంద్రబాబు అంత నేరస్తుడు ఈ దేశంలోనే ఎవడూ లేడని.. వేల, లక్షల కోట్ల రూపాయలు కాజేశాడని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించారని అన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు చూస్తే ఏ తెలుగువాడైనా బాధ పడవల్సిందేనన్నారు. -
క్రికెట్ టోర్నీని భగ్నం చేసేందుకు బాబు సర్కారు కుట్ర
-
టోర్నీని అడ్డుకునేందుకు కుట్ర: రోజా
తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో ఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆర్కే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ డ్రిల్ మాస్టర్లను పంపాలని తాను ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని..ఇందుకు వారు పంపుతానని కూడా తెలిపారని అన్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు డ్రిల్ మాస్టర్లను రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ఇది తన మీద కక్ష సాధింపేనని పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవని, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తారని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వైఎస్సార్సీపీ బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబుది గోబెల్ ప్రచారం: పార్థసారథి రాష్ట్ర ప్రయోజనాల మీద చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని,ప్రజలను తప్పుదోవ పట్టించ దానికే ప్రధాని మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్సీపీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేస్తాయని చంద్రబాబు గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికే వైఎస్సార్సీపీ, బీజేపీతో కలసి పోటీ చేయదని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేక సార్లు చెప్పాడని గుర్తు చేశారు.నేను చంద్రబాబుకు సవాల్ విసురుతున్నావచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి వైఎస్సార్సీపీ పోటీ చేస్తే నేను రాజకీయాలనుంచి విరమించుకొంటా.. కలసి పోటీ చేయకపోతే చంద్రబాబు తప్పుకుంటాడా అని పార్ధసారథి ప్రశ్నించారు. -
బంగారు భవిష్యత్తుకు వేదిక వైఎస్సార్ క్రికెట్ టోర్నీ
తిరుపతి రూరల్: క్రీడలతో పాటు వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో యువత బంగారు భవిష్యత్తుకు వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ వేదికగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలు, భారీ టోర్నమెంట్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు ఐకాన్‌గా మారారని కొనియాడారు. టోర్నమెంట్ వద్దే యువత నుంచి ఉపాధి కోసం బయోడేటాలు స్వీకరించడం హర్షణీయమన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం తుమ్మలగుంట లో నిర్వహిస్తున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ పదో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. మంగళవారం పోటీలకు విజయసాయిరెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ ఎల్బీ ప్రభాకర్‌నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో కలిసి బైక్ నడుపుతూ పది మైదానాల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్‌కు తనవంతుగా రూ.5 లక్షలను అం దిస్తానని తెలిపారు. యువతను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తాను మోడల్ జిల్లాగా ఎంచుకున్న వైజాగ్‌లో చెవిరెడ్డి సహకారంతో ఇలాంటి టోర్నమెంట్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు తాను వెన్నంటి ఉంటానని, చంద్రగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులతో ఆరు వాటర్ ట్యాంకర్లను అందిస్తానని ప్రకటించారు. యువ చైతన్యానికి ప్రతీక చెవిరెడ్డి నిత్యం ప్రజా సేవలో తరిస్తూ, యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి యువ చైతన్యానికి ప్రతీక అని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో రూ.25 లక్షల నిధులను మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 20 గంటలు శ్రమించే నాయకుడు చెవిరెడ్డి అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు నాయకుడికి గట్స్ కావా లన్నారు. ఎల్బీ ప్రభాకర్‌నాయుడు మాట్లాడు తూ చెవిరెడ్డికి యువత ఎంతగా అండగా ఉంటే అంత ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా జూలై 6న జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కోసం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆటలతో పాటు ఉపాధి కల్పించడం అద్భుతం
-
ఒంటి చేత్తో ఆడేస్తున్నాడు...
చిత్తూరు, తిరుపతి రూరల్ : ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ప్రతిభ చాటుతున్నాడు. ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లో వేదాంతపురం జట్టు తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, ఓపెనింగ్ బౌలర్‌గా ఆడుతున్న మునిశేఖర్, గురువారం ఓటేరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు విభాగాల్లో రాణించి తన జట్టును గెలిపించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకున్నాడు. శభాష్ అనిపించుకున్నాడు. -
వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- తుమ్మలగుంటలో అట్టహాసంగా మొదలైన టోర్నీ - 340 టీమ్‌లు.. భారీ ప్రైజ్‌మనీ - చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పండుగ - ప్రారంభోత్సవానికి హాజరైన పెద్దిరెడ్డి, భూమన, సజ్జల, ధనుంజయ్‌రెడ్డి తిరుపతి: గ్రామాల్లోని క్రీడాకారుల క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, పల్లెలమధ్య సత్సంబం ధాలను పెంపొందించేందుకు వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తోన్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి-చంద్రగిరి మార్గంలోని తుమ్మలగుంటలోగల వైఎస్సార్ క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ టోర్నీలో 340 జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభవేడుకలకు చెవిరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోన్న ఈ క్రీడా పోటీలకు విశేష ఆదరణ ఉంది. నాకౌ ట్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ మెడల్, సర్టిఫికెట్, మెమెంటోలను బహూకస్తారు. ప్రతి జట్టుకు నాణ్యమైన క్రికెట్‌బ్యాట్, బాల్‌ను ఉచితంగా అందించడంతోపాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, చల్లని తాగునీరువంటి సౌకర్యాలను కల్పించారు. భారీ ప్రైజ్ మనీ: తుమ్మలగుంటలోని వైఎస్సార్ క్రీడా మైదానంలో ఒకే చోట 10 క్రికెట్ గ్రౌండ్లను తయారు చేశారు. ఒకేసారి 10 మ్యాచ్‌లు నిర్వహించడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. వీక్షకుల కోసం చలువ పందిళ్లు, భోజనశాల, తాగునీరు క్యాన్ల ను సిద్ధం చేశారు. వైఎస్సార్ క్రికెట్ టోర్నీ విజేతలకు లక్ష రూపాయల ప్రైజ్ మనీని అందజేస్తారు. రన్నరప్‌కు రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచే జట్టుకు రూ.25వేలు బహుమానంగా ఇస్తారు.