Disney India: అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ముందు వరుసలో రిలయన్స్..
నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది.
ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో జియో టీవీకి సబ్‌స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment