
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మొగనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం (డిసెంబర్ 29) నిశ్చితార్థం జరిగింది. ఈమె వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె.
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరువురు సంప్రదాయబద్ధంగా రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో నాథ్‌ద్వారాలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో చదువును పూర్తి చేశాడు. అప్పటి నుంచి జియో ప్లాట్‌ఫాంతో పాటు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఆర్‌ఐఎల్ (RIL) ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నాడు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి రాధిక బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment