
ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ చిరువ్యాపారులు, స్టార్టప్ కంపెనీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్టప్‌లకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమటెడ్ (ఆర్‌ఐఎల్) 42 వ ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఈ విషయం వెల్లడించారు. అలాగే, ఉచితంగా 5 లక్షల కుటుంబాలకు జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందిస్తామన్నారు. ఇక నెలకు 500 రూపాయలతో ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ అత్యధికంగా రూ 67,000 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment