Elon Musk Sell Tesla Shares: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్లే చేశాడు..అన్నట్లుగానే టెస్లా 10 శాతం షేర్లను పూర్తిగా అమ్మేశాడు.ఈ ఏడాది నవంబర్ ప్రారంభం నుంచి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. మస్క్ తన షేర్ల అమ్మకాలను దాదాపు పూర్తి చేసినట్లు బుధవారం చెప్పాడు.
నియమాల ప్రకారమే..!
టెస్లాకు చెందిన పదిశాతం షేర్లను పూర్తిగా అమ్మేసినట్లు మంగళవారం అమెరికాకు చెందిన వెబ్‌సైట్ బాబిలోన్ బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నాడు. షేర్ల అమ్మకాలకు సంబంధించిన నియమాల మేరకు షేర్లను విక్రయించనట్లు తెలిపాడు.
కారణం అదే..!
ఇటీవల వాషింగ్టన్‌లో డెమోక్రాట్లు బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 10 శాతం టెస్లా షేర్లను అమ్మకాలతో స్పేస్‌ఎక్స్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఎలన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
టెస్లా షేర్ల అమ్మకాలపై విచారణ..!
టెస్లా షేర్ అమ్మకాల విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశాడు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు. స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్‌పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు.
చదవండి: ‘ఎలన్‌మస్క్, టెస్లాపై విచారణ చేయాల్సిందే..!’
Comments
Please login to add a commentAdd a comment