పాతికేళ్లకు చిక్కాడు... | arrest after 24 years | Sakshi
Sakshi News home page

పాతికేళ్లకు చిక్కాడు...

Published Tue, Dec 19 2017 8:44 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

arrest after 24 years

సాక్షి, బొమ్మనహళ్లి (నెలమంగళ) : బెంగళూరు నగర సమీపంలోని నెలమంగళ వద్ద చోరీకి సంబంధించి 24 ఏళ్ల తరువాత నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 1993లో నెలమంగళ సమిపంలో ఉన్న మాకళ్ళి గ్రామంలో ఒక ఇంటిలో నాగరాజు చోరబడి ఫ్యాన్, కుర్చి, టెలిఫోన్‌ చోరీ చేశాడు. ఎత్తుకెళ్ళిన వస్తువులను అమ్మి మద్యం తాగినట్లు నాగరాజు పోలిసుల ముందు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన సమయంలో వస్తువులు పోయిన యజమాని మాదనాయకనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నాగరాజను మాదనాయకనహళ్లి పోలీసులు అంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర తాలూకాలోని కాకి అనే గ్రామంలో సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement