Adani Iron Bridge Stolen: అదానీ కంపెనీ గత సంవత్సరం మలాద్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెన నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఒక శాశ్వత వంతెనను ఏర్పాటు చేసింది. శాశ్వత వంతెన ఏర్పాటైన తరువాత తాత్కాలిక వంతెనను వినియోగించడం మానేశారు.
నిరుపయోగంగా ఉన్న 6000 కీజాల తాత్కాలిక వంతెన తాజాగా కనిపించకుండా పోయింది. దీంతో అదానీ కంపెనీ ఈ విషయం మీదనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు వంతెన దొంగతనానికి కారకులైన నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు.
సుమారు 90 అడుగుల పొడవున్న ఈ వంతెనను అదానీ సంస్థ గతంలో భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడానికి నిర్మించినట్లు తెలిసింది. వంతెన నిర్మాణ సమయంలో సంబంధమున్న ఒక వ్యక్తి ప్రధాన నిందితుడుగా తెలిసింది. ఈ దొంగతనం జరగటానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఎటువంటి సీసీ కెమరాలు లేకపోవడమే. ఈ ఘటన జూన్ 26న వెలుగులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!)
పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించి జూన్ 11న ఒక భారీ ట్రక్కు వెళ్లడం గమనించి, దాని ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు దానిని గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి భారీ ట్రక్కు ద్వారా తలచినట్లు విచారణలో తేలికైనది. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటన బీహార్ ప్రాంతంలో కూడా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment