iron bridge
-
ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు
శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
6 టన్నుల ఐరన్ బ్రిడ్జి అలా మాయమైంది!
ముంబై: ముంబై శివారు మలాడ్(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్ 26న బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్ కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
6000 కేజీల అదానీ ఐరన్ బ్రిడ్జ్ మాయం.. ఏమైందో తెలిస్తే..
Adani Iron Bridge Stolen: అదానీ కంపెనీ గత సంవత్సరం మలాద్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెన నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఒక శాశ్వత వంతెనను ఏర్పాటు చేసింది. శాశ్వత వంతెన ఏర్పాటైన తరువాత తాత్కాలిక వంతెనను వినియోగించడం మానేశారు. నిరుపయోగంగా ఉన్న 6000 కీజాల తాత్కాలిక వంతెన తాజాగా కనిపించకుండా పోయింది. దీంతో అదానీ కంపెనీ ఈ విషయం మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు వంతెన దొంగతనానికి కారకులైన నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 90 అడుగుల పొడవున్న ఈ వంతెనను అదానీ సంస్థ గతంలో భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడానికి నిర్మించినట్లు తెలిసింది. వంతెన నిర్మాణ సమయంలో సంబంధమున్న ఒక వ్యక్తి ప్రధాన నిందితుడుగా తెలిసింది. ఈ దొంగతనం జరగటానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఎటువంటి సీసీ కెమరాలు లేకపోవడమే. ఈ ఘటన జూన్ 26న వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!) పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించి జూన్ 11న ఒక భారీ ట్రక్కు వెళ్లడం గమనించి, దాని ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు దానిని గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి భారీ ట్రక్కు ద్వారా తలచినట్లు విచారణలో తేలికైనది. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటన బీహార్ ప్రాంతంలో కూడా వెలుగులోకి వచ్చింది. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘కిన్నెరసాని’పై ఇనుప వంతెన ఏర్పాటు
గుండాల: శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కిన్నెరసాని నదిపై తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటైంది. దీంతో వర్షం వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహించినా రాకపోకలు సులభతరం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం–నడిమిగూడెం గ్రామాల నడుమ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వర్షాలతో నదీ వ్రాహం పెరగగా, గిరిజనులు కట్టెలతో నిచ్చెన మాదిరి ఏర్పాటుచేసుకుని దాటిన విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాలతో గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రమేశ్ సిబ్బందితో కలసి బుధవారం ఇనుప పైపులు, స్లాబ్ రేకులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు. చదవండి: ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ -
వరద బీభత్సం :జల్లేరు వద్ద తెగిన రహదారి
-
ఇనుప బ్రిడ్జిలో గోళాకార నిర్మాణం అవసరం?
ఉష్ణం - ద్రవ ఉష్ణోగ్రతా మాపకాలు ద్రవాలను వేడి చేసినప్పుడు వాటి ఘన పరిమాణం పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా ద్రవ ఉష్ణోగ్రత మాపకాలు పనిచేస్తాయి. వీటిలో ఏ ద్రవాన్నయినా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఉష్ణోగ్రత మాపకాల్లో నీటికి బదులుగా పాదరసాన్ని ఉపయోగిస్తారు. దీనికి కారణాలు: 1. పాదరసం సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. నీటి సంకోచ, వ్యాకోచాలు అసమానంగా ఉంటాయి. 2. నీరు పాత్ర గోడలకు అంటుకొని ఉంటుంది. కానీ పాదరసం పాత్ర గోడలకు అంటుకొని ఉండదు. 3. స్వభావరీత్యా పాదరసం వెండిలా మెరుస్తుంది. అందువల్ల దీన్ని క్విక్ సిల్వర్ అంటారు. ఈ కారణంగా రీడింగ్‌లను ఎలాంటి దోషాలు లేకుండా కచ్చితంగా గుర్తించవచ్చు. నీటికి రంగు ఉండదు. అదేవిధంగా నీరు, గాజు వక్రీభవన గుణకాల విలువలు దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్ల రీడింగ్‌లను కచ్చితంగా గుర్తించడం వీలు కాదు. 4. మనకు లభించే ద్రవ పదార్థాలన్నింటిలో పాదరసానికి విశిష్టోష్ణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడే గుణాన్ని కలిగి ఉంటుంది. నీటి విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ఆలస్యంగా వేడెక్కి, ఆలస్యంగా చల్లబడుతుంది. అందువల్ల ఉష్ణోగ్రతలను తొందరగా నమోదు చేయడం వీలుకాదు. అతిశీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఆల్కహాల్ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగిస్తారు. అతిశీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే ఏ ఉష్ణోగ్రత మాపకాన్నయినా సైరో మీటర్ అని అంటారు. వాహనాల రేడియేటర్లలో నీటిని కూలెంట్ (శీతలీకరణి)గా ఉపయోగిస్తారు. విశిష్టోష్ణం ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆలస్యంగా వేడెక్కి, ఆలస్యంగా చల్లబడటమే దీనికి కారణం. విశిష్టోష్ణం m – పదార్థం ద్రవ్యరాశి Q – పదార్థానికి అందించిన ఉష్ణరాశి t – పదార్థ ఉష్ణోగ్రతలోని మార్పు విశిష్టోష్ణం అన్ని ఘన, ద్రవ, వాయు పదార్థాలకు ఉండే ఒక స్వాభావిక ధర్మం. ఆయా పదార్థ స్వభావం ఆధారంగా విశిష్టోష్ణం విలువలు వేర్వేరుగా ఉంటాయి. పాదరసం (Hg) పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించే ఒక మూలకం (లోహం). 1. దీన్ని సిన్నబార్ అనే ముడిధాతువు నుంచి సంగ్రహిస్తారు. 2. పాదరసం మంచి విద్యుత్, ఉష్ణ వాహకం. అందువల్ల దీన్ని ద్రవ ఉష్ణోగ్రత మాపకాల్లో ఉపయోగిస్తారు. 3. పాదరసం అన్ని లోహాలతో రసాయన చర్య జరిపి ఏర్పరిచే పదార్థాలను అమాళ్గంలు అంటారు. కానీ పాదరసం ఇనుముతో రసాయనిక చర్యలో పాల్గొనదు. అందువల్ల దీన్ని ఇనుప పాత్రల్లో నింపి రవాణా చేస్తారు. పాదరసం కాలుష్యం వల్ల ‘మినిమెటా’ అనే వ్యాధి వస్తుంది. ఇది మొదటిసారిగా జపాన్‌లో వచ్చింది. పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు: ప్రతి ఘన పదార్థంలో దాని ద్రవ్యరాశి 3 అక్షాల (x అక్షం - పొడవు, y అక్షం- వెడల్పు, z అక్షం - ఎత్తు) వెంట విభజితమై ఉంటుంది. ఈ ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి స్వభావం ఆధారంగా అణువుల మధ్య బంధ దూరంలో మార్పు వస్తుంది. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం తగ్గడం వల్ల అవి సంకోచిస్తాయి. ఉదా: రబ్బరు, గాజు (80 C°), ఫీజు తీగ, సిల్కు దుస్తులు, తలవెంట్రుకలు, ప్లాస్టిక్. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం పెరగడం వల్ల అవి వ్యాకోచిస్తాయి. ఉదా: అల్యూమినియం, రాగి, ఇనుము, ఉక్కు. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు లేదా చల్లబర్చినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాంటి ఘన పదార్థాల్లో సంకోచన, వ్యాకోచాలు ఉండవు. ఉదా: చెక్క దిమ్మె. ఘన పదార్థాలకు మూడు రకాల వ్యాకోచాలుంటాయి. 1. దైర్ఘ్య వ్యాకోచం: ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ఒక అక్షం వెంట మాత్రమే వ్యాకోచిస్తే దాన్ని దైర్ఘ్య వ్యాకోచం అంటారు. 2. విస్తీర్ణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఏదైనా 2 అక్షాల వెంట వ్యాకోచిస్తే దాన్ని విస్తీర్ణ వ్యాకోచం అంటారు. వైశాల్యం = పొడవు ణ వెడల్పు 3. ఘన పరిమాణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు అన్ని అక్షాల వెంట వ్యాకోచిస్తే దాన్ని ఘన పరిమాణ వ్యాకోచం అంటారు. ఘన పరిమాణం = పొ × వె × ఎత్తు పైన పేర్కొన్న మూడు రకాల ఉష్ణ వ్యాకోచాలను పరిశీలించినప్పుడు ఘన పరిమాణంలో ఉష్ణ వ్యాకోచం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దైనందిన జీవితంలో ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచానికి ఉదాహరణలు: 1. ఒక లోహ పలక మధ్య భాగంలో కొంత వ్యాసం ఉన్న ఒక రంధ్రం ఉంది. ఈ రంధ్రం మధ్య బిందువు వద్ద వేడి చేసినప్పుడు అందించిన ఉష్ణం అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. కాబట్టి లోహ పలక వ్యాకోచానికి అనుగుణంగా రంధ్రం వ్యాసం కూడా పెరుగుతుంది. 2. అల్యూమినియం పాత్రలో ఒక ఇనుప పాత్ర బంధించి ఉంది. వీటిని వేరు చేయడానికి గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. అప్పుడు ఇనుము కంటే అల్యూమినియం ఎక్కువగా వ్యాకోచించడం వల్ల దాని పరిమాణం పెరుగుతుంది. అప్పుడు రెండు పాత్రలను సులభంగా వేరు చేయవచ్చు. ఒకవేళ ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్ర బంధించి ఉంటే.. వాటిని వేరు చేయడానికి చల్లబర్చాలి. ఈ సందర్భంలో ఇనుము కంటే అల్యూమినియం ఎక్కువగా సంకోచించడం వల్ల దాని పరిమాణం తగ్గుతుంది. 3. ఇంటి పై కప్పుల నిర్మాణంలో కాంక్రీటుతోపాటు ఇనుమును ఉపయోగించడానికి కారణం ఆ రెండు పదార్థాల సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉండటమే. 4. విద్యుత్ బల్బులను, గాజు వస్తువులను సీల్ చేయడానికి ప్లాటినాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రెండు పదార్థాల సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. 5. సిమెంట్ రోడ్డును నిర్మించేటప్పుడు రాళ్ల మధ్య తగినంత ఖాళీని వదిలి వేయడం వల్ల అవి స్వేచ్ఛగా సంకోచన, వ్యాకోచాలు చేయగలుగుతాయి. 6. ఇనుప బ్రిడ్జిలను బిళ్లల ఆకారంలో నిర్మించి వాటిని స్తూపాకారం లేదా గోళాకారం ఉన్న నిర్మాణాలపై అమర్చుతారు. అందువల్ల ఆ ఇనుప బ్రిడ్జిలో ఉన్న బిళ్లలు స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చేయగలుగుతాయి. 7. చల్లటి గాజు దిమ్మెపై వేడి ద్రవాన్ని చల్లినప్పుడు గాజు పొరల మధ్య ఉండే అసమాన వ్యాకోచనాల వల్ల అది పగిలిపోతుంది. 8. ద్విలోహ ఫలక: దీన్ని ఇనుము, ఇత్తడి ఫలకలను ఉపయోగించి నిర్మిస్తారు. ఈ పరికరం స్వయంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటూ పని చేస్తుంది. కాబట్టి ‘దీన్ని ఉష్ణ తాపక నియంత్రక యంత్రం (థెర్మోస్టాట్)’ అని కూడా అంటారు. ఆటోమెటిక్ ఐరన్ బాక్స్, రిఫ్రిజిరేటర్లలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. 9. ఇన్వార్ స్టీల్: ఈ మిశ్రమ లోహాన్ని వేడిచేసినా లేదా చల్లార్చినా దానిలో ఎలాంటి సంకోచన, వ్యాకోచనాలు ఏర్పడవు. కాబట్టి ఇన్వార్ స్టీల్‌ను కింద పేర్కొన్న పరికరాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఎ. మీటర్ స్కేలు బి. శృతిదండం సి. లఘులోలకం రెండు వరుస రైలు పట్టాల మధ్య తగినంత ఖాళీని వదిలేస్తారు. దీని వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా అవి స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చేయగలుగుతాయి. రెండు వరుస విద్యుత్ లేదా టెలిఫోన్ స్తంభాల మధ్య తీగలను కొంచెం వదులుగా బిగిస్తారు. దీని వల్ల శీతాకాలంలో తీగలు సంకోచించినా ప్రమాదం ఏర్పడకుండా ఉంటుంది. వేడిగాజు దిమ్మెపై చల్లటి ద్రవాన్ని చల్లినప్పుడు గాజు పొరల మధ్య ఉండే అసమాన సంకోచనాల వల్ల అది పగిలిపోతుంది. ఎడ్లబండి కొయ్య చక్రానికి ఇనుప చక్రాన్ని బిగించడానికి ముందు దాన్ని కొలిమిలో అమర్చి వేడి చేస్తారు. ఇనుప చక్రం వ్యాకోచించి దాని వ్యాసం పెరుగుతుంది. ఈ ఇనుప చక్రాన్ని కొయ్య చక్రంపై అమర్చి నీటిని చల్లినప్పుడు అది సంకోచించి గట్టిగా బిగుసుకుంటుంది. - సి.హెచ్. మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్.