
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నమ్మిన యజమానురాలిని మోసం చేసిన డ్రైవర్ ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలివీ.. మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి బంజారాహిల్స్ రోడ్ నంబర్.14లోని ప్రేమ్‌పర్వత్ విల్లాస్‌లో నివసిస్తుంది.
గతేడాది డిసెంబర్ నుంచి చిన్నా అలియాస్ కె. బీసన్న ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆమెకు చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించి శ్రీమహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శృతిరెడ్డి సదరు డ్రైవర్‌ను ప్రశ్నించింది.
చదవండి: హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
అబద్దాలు చెప్పడమే కాకుండా రకరకాల కథలతో ఆమెను నమ్మించాలని చూసినా చివరకు తన క్రెడిట్ కార్డును దొంగిలించి డబ్బు వాడుకున్న విషయం వెల్లడైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చిన్నా అలియాస్ బీసన్నపై ఐపీసీ 420, 408ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment