బాలుడు బ్యాంక్‌ నుంచి 3 లక్షలు చోరీ | Boy steals Rs. 3 lakh from Bank in UP | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 11:26 AM

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఉన్న స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో శుక్రవారం దొంగతనం జరిగింది. బ్యాంకులోకి వచ్చిన ఓ 12 ఏళ్ల కుర్రాడు కాసేపు అటు ఇటు తిరిగి.. ఆ తర్వాత రూ. 3 లక్షల నగదు ఉన్న ఓ బ్యాగును దొంగిలించాడు. అదేదో ఇంట్లో నుంచి స్కూలు బ్యాగ్‌ తీసుకెళ్లినట్లు ఏ మాత్రం బయం లేకుండా నగదు ఉన్న బ్యాగ్‌ను చేతపట్టుకెళ్లాడు. బ్యాంకు అధికారులు నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ  ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement