ఏలూరులో చైన్ స్నాచింగ్
Published Wed, Nov 9 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
ఏలూరు అర్బన్ : ఆలయానికి ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వచ్చిన అగంతకుడు లాక్కుని ఉడాయించాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు వ న్‌టౌ న్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దక్షిణపు వీధికి చెందిన సలాది లక్ష్మీకుమారి అనే మహిళ సోమవారం రాత్రి ఒంటరిగా ఆలయానికి నడిచి వెళుతున్నారు. ఈ సమయంలో వెనుకగా బైకుపై వచ్చిన అగంతకుడు హఠాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
Advertisement
Advertisement