
సాక్షి, అల్వాల్: పెంపుడు పిల్లిని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు.
దీంతో నేరేడ్‌మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment