సాక్షి,హైదరాబాద్: డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యున్‌ల్‌లో(క్యాట్) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు బిగ్ షాక్ తగిలింది. డీఓపీటీ ఉత్తర్వులను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం సదరు ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది క్యాట్
డీఓపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలని, ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా?’ అని క్యాట్ ప్రశ్నించింది.
కాగా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌రాస్, జి.సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
👉చదవండి: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ విభజనపై కేంద్రం కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment