సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది
డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించింది. విచారణలో భాగంగా ఐఏఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఐఏఎస్‌లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు.
ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై విచాణ జరిగిందిలా
విచారణ సందర్భంగా.. డీపీవోటీ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్రంలో ఉన్న అధికారులంతా అనుభవజ్ఞులు. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే విజ్ఞత వాళ్లకు ఉంది. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే అధికారం కోర్టులకు లేదని అన్నారు.
ప్రజా సేవ కోసమే ఐఏఎస్‌లు
ప్రజా సేవ కోసమే ఐఏఎస్‌లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలి. ట్రైబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు.ఇది లాంగ్ ప్రాసెస్.అధికారులు ముందు రిపోర్ట్ చేయండి’అని హైకోర్టు స్పష్టం చేసింది.
అనంతరం ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని వినిపించారు. స్థానిక తను పరిగణలోకి తీసుకోవాలని,ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.
తీర్పును వాయిదా వేయాలంటూ
పండగలు ఉన్నాయి అప్పటివరకు స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఇప్పుడు ఏం లేవన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అయితే అందుకు ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని చెప్పగా.. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ కోరింది. అందుకు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని ఐఏఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఐఏఎస్‌లను రిలీవ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
ఐఏఎస్‌ల విజ్ఞప్తిపై హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. బుధవారం సాయంత్రంలోగా ఐఏఎస్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాలని, కాబట్టి పూర్తి స్థాయిలో వినాలంటూ పట్టుబట్టడటంతో వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి
అటు డీవోపీటీ, ఇటు ఐఏఎస్‌ల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ..15రోజుల పాటు ఊరట కల్పించాన్న ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనంతరం, ‘ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వింటాం. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి’ అని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది.
👉చదవండి: ఐఏఎస్‌లకు క్యాట్ చురకలు
Comments
Please login to add a commentAdd a comment