బ్యాంక్‌ నుంచి నగదు ఎత్తుకెళ్లిన బాలుడు! | Boy steals Rs. 3 lakh from Bank in UP | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ నుంచి 3 లక్షలు ఎత్తుకెళ్లిన బాలుడు!

Published Sat, Mar 17 2018 12:27 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Boy steals Rs. 3 lakh from Bank in UP - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఉన్న స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో శుక్రవారం దొంగతనం జరిగింది. బ్యాంకులోకి వచ్చిన ఓ 12 ఏళ్ల కుర్రాడు కాసేపు అటు ఇటు తిరిగి.. ఆ తర్వాత రూ. 3 లక్షల నగదు ఉన్న ఓ బ్యాగును దొంగిలించాడు. అదేదో ఇంట్లో నుంచి స్కూలు బ్యాగ్‌ తీసుకెళ్లినట్లు ఏ మాత్రం బయం లేకుండా నగదు ఉన్న బ్యాగ్‌ను చేతపట్టుకెళ్లాడు. బ్యాంకు అధికారులు నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ  ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement