సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఓ మహిళ హల్చల్ చేసింది.
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఓ మహిళ హల్చల్ చేసింది. డాక్టర్ వేషంలో వచ్చిన అమ్మడు....అందినకాడికి మహిళా వైద్యుల బ్యాగ్లను నొక్కేసింది. సుమారు పదిమంది బ్యాగ్లను అపహరించిన ఆమె అక్కడ నుంచి ఉడాయిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం మహిళను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.