68 మిలియన్ల యూజర్ ఐడీలు చోరీ
68 మిలియన్ల యూజర్ ఐడీలు చోరీ
Published Sat, Sep 3 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
వాషింగ్టన్ : యూజర్ అకౌంట్ల చోరీ, లీకేజీల లొల్లితో కంపెనీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా మరో క్లౌడ్ ఆధారిత డేటా స్టోరేజ్ కంపెనీ డ్రాప్బాక్స్ తన యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకైనట్టు వెల్లడించింది. దాదాపు 68 మిలియన్ క్లయింట్ల ఐడీలు, పాస్వర్డ్లు నాలుగేళ్ల క్రితం చోరీకి గురయ్యాయని, తాజాగా అవి ఇంటర్నెట్లో లీకైనట్టు డ్రాప్బాక్స్ తెలిపింది. అయితే ఏ యూజర్ అకౌంట్లు హ్యక్ అయ్యాయో తెలుపలేదు. అకౌంట్ల పాస్వర్డ్ల రీసెట్ చేసుకోవాలని కంపెనీ యూజర్లకు సూచించింది.
రెండు వారాల క్రితమే కంపెనీ 68 మిలియన్ యూజర్ల ఆధారాలు ఆన్లైన్లో పోస్టు అయినట్టు కనుగొంది. అయితే ఈ పని ఎవరు చేసిందన్నది ఇంకా వెల్లడించలేదు. యూజర్ ఐడీల, పాస్వర్డ్ల చోరీపై చింతిస్తున్నామని, ఈ ఘటనకు తాము యూజర్లకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. 2012లో ఈ అకౌంట్ల చోరీ జరిగిందని, అప్పటి ఈమెయిల్ యూజర్లు ఈ బారీన పడినట్టు తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొంది.
2012 నుంచి పాస్వర్డ్లను అప్డేట్ చేసుకోని వారు వెంటనే రీసెట్ చేసుకోవాలని సూచించింది. 2012 ముందునుంచి తమ సర్వీసులను వినియోగించుకుంటూ, ఒకే పాస్వర్డ్ వాడుతున్న యూజర్లను డ్రాప్బాక్స్ హెచ్చరించింది. వెంటనే తమ అకౌంట్ రక్షణ కోసం పాస్వర్డ్ మార్చుకోవాలని తెలిపింది.
Advertisement
Advertisement